Sukumar Demands: ఒక్క సినిమాకే అన్ని కోట్లు తీసుకుంటున్నాడా!
ఒకే ఒక సినిమా అటు హీరో, ఇటు డైరెక్టర్ జాతకాలను మార్చేస్తుంది. మార్కెట్ విలువను పెంచుతుంది కూడా.
- By Balu J Published Date - 07:20 PM, Thu - 26 May 22

ఒకే ఒక సినిమా అటు హీరో, ఇటు డైరెక్టర్ జాతకాలను మార్చేస్తుంది. మార్కెట్ విలువను పెంచుతుంది కూడా. క్రియేటివ్ డైరెక్టర్ సుక్కు, అల్లు అర్జున్ కాంబో లో తెరకెక్కిన పుష్ప సినిమా ఎంత హిట్ సాధించిందో తెలిసిందే. అయితే ఓ సినిమా భారీ హిట్ సాధిస్తే.. సాధారణంగా హీరోలు తమ రెమ్యూనరేషన్ (పారితోషికం) పెంచడం అనేది సర్వసాధారణం. కానీ డైరెక్టర్ రెట్టింపు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడట.
‘పుష్ప’ మొదటి భాగానికి గానూ సుకుమార్ 18 కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకున్నారు. హిందీ మార్కెట్‌లో ఈ సినిమా భారీ హిట్ కావడంతో రెండో పార్ట్ బడ్జెట్ రెండింతలు పెరిగింది. దర్శకుడు రెమ్యునరేషన్ రెట్టింపు చేశాడు. సెకండ్ పార్ట్ కోసం సుకుమార్ 40 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటాడని ఇన్‌సైడ్‌వర్గాలు చెబుతున్నాయి. ఏ దర్శకుడికైనా ఇది ఆశ్చర్యం కలిగించే అంశం. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకులలో సుకుమార్ అధికారికంగా చేరాడు.