Supreme Court Fire Accident: సుప్రీంకోర్టులో అగ్ని ప్రమాదం? కారణం?
సుప్రీంకోర్టులో సోమవారం స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోర్టు నంబర్ 11, 12 మధ్య ఉన్న వెయిటింగ్ ఏరియాలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సుప్రీంకోర్టు సెక్యూరిటీ, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
- Author : Kode Mohan Sai
Date : 02-12-2024 - 3:04 IST
Published By : Hashtagu Telugu Desk
Supreme Court Fire Accident: సుప్రీంకోర్టులో సోమవారం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. కోర్టు నంబర్ 11 మరియు 12 మధ్య ఉన్న వెయిటింగ్ ఏరియాలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అయితే, అప్రమత్తమైన సుప్రీంకోర్టు సెక్యూరిటీ మరియు అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆపేందుకు తక్షణమే చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని కోర్టు వర్గాలు వెల్లడించాయి.
ఈ అగ్నిప్రమాదం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని, ఎవరూ కూడా గాయపడలేదని తెలిపాయి సుప్రీంకోర్టు వర్గాలు. అయినప్పటికీ, 12వ నంబర్ కోర్టులో ఈ రోజు జరిగే విచారణలు నిలిపివేయాల్సి వచ్చింది. పొగ రావడంతో అక్కడకు వచ్చినవాళ్లు ఆందోళన చెందారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలుగడంతో సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ అగ్నిప్రమాదం ఓ హెచ్చరికగా మారింది. ఈ మధ్యకాలంలో అగ్నిప్రమాదాలు బాగా పెరిగాయి, వాటిలో ముఖ్యంగా షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగే ప్రమాదాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇళ్లల్లో, ఆఫీసుల్లో, పరిశ్రమల్లో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండటం, విద్యుత్ సదుపాయాలను బాగా చూసుకోవడం అవసరం. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే రిపేర్ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.