Tamilnadu : పులి ఫై పగ తీర్చుకున్న రైతు..
ఓ రైతుకు చెందిన ఆవు మేతకు వెళ్లి కనిపించకుండా పోయింది. దగ్గర్లో ఉన్న అడవిలో పులి దాడికి చనిపోయి ఉంది
- By Sudheer Published Date - 10:27 AM, Wed - 13 September 23

పులి అంటేనే హడల్ ..అలాంటిది పులి (Tiger) పైనే ఓ రైతు పగ (Farmer Revenge ) తీర్చుకున్నాడు. ప్రాణానికి ప్రాణం అన్నట్లు..పులిని చంపి తన పగను తీర్చుకున్నాడు. అదేంటి పులి ఫై పగ ఎందుకు అనుకుంటున్నారా..? అయితే ఈ ఫుల్ స్టోరీ చదవాల్సిందే.
తమిళనాడులోని నీల్‌గిరి జిల్లాలో (Nilgiri district of Tamil Nadu) పది రోజుల కిందట ఓ రైతుకు చెందిన ఆవు (cow ) మేతకు వెళ్లి కనిపించకుండా పోయింది. దగ్గర్లో ఉన్న అడవిలో పులి దాడికి చనిపోయి ఉంది. అది చూసిన రైతు తట్టుకోలేకపోయాడు.. తన అవును ఆ పరిస్థితిలో చూసి కంటతడి పెట్టుకున్నాడు. దీంతో తన ఆవును చంపిన పులిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. అంతే చనిపోయిన ఆవు కళేబరానికి విషం పుసాడు. ఆ తర్వాత ఆ కళేబరాన్నిఎనిమిదేళ్ల వయసున్న రెండు పులులు తిని చనిపోయాయి.
Read Also : AP Special Status : కొడాలి నానికి అరెస్ట్ వారెంట్ జారీ..
పులులు చనిపోవడం చూసి ఓ వ్యక్తి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా.. దీనిపై విచారణ చేపట్టిన అధికారులకు వాటికి సమీపంలో ఓ ఆవు కళేబరం లభ్యమైంది. పులులు, ఆవు కళేబరాల నుంచి నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం కోయంబత్తూరుకు పంపారు. వాటిలో పురుగు మందుల అవశేషాలు ఉన్నట్టు గుర్తించారు. విషపూరితమైన ఆవు కళేబరాన్ని తినడంతో పులులు చనిపోయినట్టు ధ్రువీకరించారు. ఈ క్రమంలో సోమవారం ఆవు యజమాని శేఖర్‌ను అటవీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించగా.. నిజం ఒప్పుకున్నాడు. పది రోజుల కిందట తన ఆవును పులి చంపినట్లు శేఖర్ తెలిపాడు. పులిపై ప్రతీకారం తీర్చుకోవాలని.. సగం తిని వదిలిన ఆవు మృత కళేబరానికి పురుగుమందులు పూసి తానే విషపూరితం చేసినట్టు అంగీకరించాడు. దీంతో శేఖర్ ను అదుపులోకి తీసుకున్నారు.