Fake Constable: హైదరాబాద్ లో నకిలీ మహిళా కానిస్టేబుల్ అరెస్ట్
హైదరాబాద్ లో ఓ నకిలీ మహిళా కానిస్టేబుల్ అరెస్ట్ అయ్యింది.
- By Balu J Published Date - 05:55 PM, Thu - 15 June 23

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస మోసాలకు పాల్పడుతున్న మహిళను హైదరాబాద్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఓ మహిళ అశ్విని అనే పోలీసు కానిస్టేబుల్‌గా నటిస్తూ ఐడీ కార్డును తయారు చేసుకుంది. హైదరాబాద్ పోలీస్ ఫోర్స్‌లో ఆర్మ్‌డ్ రిజర్వ్ (AR) కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్టు అందరినీ నమ్మించింది. అయితే లంగర్ హౌస్ నివాసిని మోసగించడానికి ప్రయత్నించినప్పుడు ఆమె అసలు రహస్యం బయటపడింది. ఉద్యోగం ఇప్పిస్తానని అతని నుంచి రూ.30,000 తీసుకుంది. అయితే ఆ వ్యక్తికి ఉద్యోగం రాకపోవడంతో విసుగు చెంది పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి విచారణ చేయగా, నకిలీ కానిస్టేబుల్ అని తెలిసింది.
Also Read:Adipurush Openings: ఓపెనింగ్స్ లో ఆదిపురుష్ రికార్డ్, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ రికార్డులు బద్ధలయ్యేనా!