D. Srinivas : విషమంగానే డి.శ్రీనివాస్ ఆరోగ్యం.. ఆందోళనలో అభిమానులు
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) పరిస్థితి విషమంగా ఉంది. రెండు రోజుల క్రితం ఆయన ఆస్పత్రిలో
- By Prasad Published Date - 02:25 PM, Wed - 13 September 23

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) పరిస్థితి విషమంగా ఉంది. రెండు రోజుల క్రితం ఆయన ఆస్పత్రిలో చేరారు.అయితే ఆయన ఇంకా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు సిటీ న్యూరో ఆస్పత్రికి తరలించారు. ధర్మపురి శ్రీనివాస్ శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన్ని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు ఆస్తమా, కిడ్నీ, బీపీ సమస్యలు ఉన్నాయని, వయసు రీత్యా అనారోగ్య సమస్యలు తలెత్తాయని చెబుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని, మరో 48 గంటలపాటు అబ్జర్వేషన్ అవసరమని వైద్యులు చెబుతున్నారు. ఈ మేరకు సిటీ న్యూరో ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. డీఎస్ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.