Swiss Open: పీవీ సింధుకు మరో కిరీటం.. స్విస్ ఓపెన్ విజేత
భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, ఈ ఏడాది రెండో టైటిల్ ఖాతాలో వేసుకుంది. జనవరిలో సయ్యద్ మోదీ ఓపెన్ గెలిచిన ఒలింపిక్ మెడల్ విన్నర్ పీవీ సింధు తాజాగా స్విస్ ఓపెన్ 2022 టైటిల్‌ను కైవసం చేసుకుంది.
- By Naresh Kumar Published Date - 07:00 PM, Sun - 27 March 22

భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, ఈ ఏడాది రెండో టైటిల్ ఖాతాలో వేసుకుంది. జనవరిలో సయ్యద్ మోదీ ఓపెన్ గెలిచిన ఒలింపిక్ మెడల్ విన్నర్ పీవీ సింధు తాజాగా స్విస్ ఓపెన్ 2022 టైటిల్‌ను కైవసం చేసుకుంది. థాయ్‌లాండ్‌కి చెందిన బుసానన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 21-16,21-8 తేడాతో వరుస సెట్లలో ఘన విజయం అందుకుంది. ఆట ఆరంభం నుంచే పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపించిన పీవీ సింధు వరుస పాయింట్లతో అదరగొట్టింది. ప్రత్యర్థిని కోర్టు నలువైపులా పరుగెత్తిస్తూ అలసిపోయేలా చేసింది.
తొలి గేమ్ కోసం కాస్త శ్రమించిన సింధు… రెండో గేమ్ లో మాత్రం ప్రత్యర్థికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా గేమ్ ను గెలిచి మ్యాచ్ ను ముగించింది. ఈ సీజన్ లో సిందుకు ఇది రెండో టైటిల్. ఇదిలా ఉంటే పురుషుల సింగిల్స్ లో మాత్రం భారత్ కు నిరాశ ఎదురైంది. అంచనాలకు మించి రాణించి ఫైనల్ చేరిన తెలుగు కుర్రాడు ప్రణయ్ తుది మెట్టుపై బోల్తా పడ్డాడు. 48 నిమిషాల పాటు జరిగిన ఫైనల్ల ప్రణయ్ 12-21, 18-21తో జొనాథన్ క్రీస్టీ (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలయ్యాడు.
From Basel with ❤️#SwissOpen2022 🏆🥇✅
Thank you everyone for your immense support and wishes! 🤗means a lot 🙏🏼 pic.twitter.com/Q4HbqL59zQ
— Pvsindhu (@Pvsindhu1) March 27, 2022