TTE Urinates: మద్యం మత్తులో రైల్వే టీటీఈ.. మహిళపై మూత్ర విసర్జన!
మహిళ నిద్రిస్తున్న సమయంలో టీటీఈ (TTE) మూత్ర విసర్జన చేశాడని, ఆ తర్వాత ఆమె వెంటనే అలర్ట్ అయ్యింది
- By Balu J Published Date - 04:50 PM, Tue - 14 March 23

విమానాల్లో తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. విమానాల్లో మాదిరిగా రైళ్లలో ఈ తరహా ఘటలు జరుగుతుండటంతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమృత్‌సర్, కోల్‌కతా మధ్య నడిచే రైలులో ఓ జంట ప్రయాణిస్తోంది. అయితే మద్యం మత్తులో (TTE) రైలులో మహిళపై మూత్ర విసర్జన (Urinates) చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో మార్చి 12 ఆదివారం అర్ధరాత్రి జరిగినట్లు సమాచారం. ఆ టీటీఈని బీహార్‌కు చెందిన మున్నా కుమార్‌గా గుర్తించారు.
మహిళ నిద్రిస్తున్న సమయంలో టీటీఈ (TTE) మూత్ర విసర్జన చేశాడని, ఆ తర్వాత ఆమె వెంటనే మేల్కొని అలారం మోగించింది. ఆమె భర్త టీటీఈ (TTE) ని పట్టుకోవడంతో ఇతర ప్రయాణికులు మేల్కొని పట్టుకొని పోలీసులకు (GRP) అప్పగించారు. అమృత్‌సర్‌లో నివాసం ఉంటున్న ప్రయాణికుడు రాజేష్, అతని భార్య తన భార్య ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నట్లు GRP చార్‌బాగ్ రైల్వే స్టేషన్ ఇన్‌చార్జి నవరత్న గౌతమ్ తెలిపారు.
కొన్ని నెలల క్రితం ఎయిరిండియా విమానంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తన పక్కనే కూర్చున్న మహిళపై మూత్ర విసర్జన చేశాడు. ఆ తర్వాత అమెరికాలో పనిచేస్తున్న భారతీయుడు శంకర్ మిశ్రాను అదుపులోకి తీసుకుని ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించకుండా నాలుగు నెలల పాటు నిషేధం విధించారు.
Also Read: Anasuya Skin Show: తొడలు చూపిస్తూ.. రెచ్చగొడుతూ, అనసూయ థైస్ పిక్స్ వైరల్!

Related News

Porn Video: షాకింగ్.. రైల్వే స్టేషన్ టీవీల్లో బూతు వీడియోలు, షాకైన ప్రయాణికులు!
ఓ రైల్వే స్టేషన్ లోని టీవీల్లో పోర్న్ వీడియో ప్లే కావడం ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది.