Viral Video: ఇదేం దోస్తీరా బాబోయ్…కుక్క, కోతి కలిస్తే ఇంత పని జరిగిందా..?
కోతులు, కుక్కల మధ్య వైరం ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే, చాలా మంది రైతులు తమ పండ్ల తోటల్లో కోతులు రాకుండా కుక్కలను పెంచుకుంటారు.
- Author : Hashtag U
Date : 20-05-2022 - 6:05 IST
Published By : Hashtagu Telugu Desk
కోతులు, కుక్కల మధ్య వైరం ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే, చాలా మంది రైతులు తమ పండ్ల తోటల్లో కోతులు రాకుండా కుక్కలను పెంచుకుంటారు. కానీ నెట్టింట ఓ వీడియో కోతి, కుక్క మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రపంచానికి చాటింది. ఈ వీడియోలో కోతి చేసే దొంగతనానికి కుక్క హెల్ప్ చేసింది.
#MonkeyVsDog పేరిట ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న ఈ వీడియో చూస్తే మీరు నవ్వు ఆపుకోలేరు, కుక్క, కోతి స్నేహానికి సంబంధించిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఇందులో ఒక కోతి కుక్క వీపుపైకి ఎక్కింది. అది చిప్స్ ప్యాకెట్‌ను దొంగిలించడం కనిపిస్తుంది. సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన ఈ వీడియో చూసిన జనాలు నవ్వు ఆపుకోలేకపోతున్నారు.
ఈ ఫన్నీ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో naughty.raa అనే అకౌంట్ ద్వారా తొలిసారి షేర్ చేశారు. ఈ వీడియో షేర్ చేయబడినప్పటి నుండి ఇప్పటివరకు 1,047,173 లైక్‌లను పొందింది.
ఈ వీడియోను చూసిన చాలా మంది కుక్క, కోతి స్నేహాన్ని అద్భుతం అని వర్ణించారు. తమ స్పందనను తెలియజేస్తూ, ఒక వినియోగదారు ఇలా వ్రాశారు – ఈ ఇద్దరి స్నేహం చూసి, నాకు నా చిన్ననాటి స్నేహితుడు గుర్తుకొచ్చాడు. అదే సమయంలో, మరొక వినియోగదారు ఇలా వ్రాశారు – ఈ స్నేహానికి నా హృదయం పొంగింది అని కామెంట్ చేశాడు.
వైరల్ అవుతున్న వీడియోలో, ఒక కోతి తన స్నేహితుడు అంటే కుక్క వీపు మీద కూర్చున్నట్లు చూడవచ్చు. కుక్క కోతిని తన వీపుపైకి కూర్చోబెట్టుకొని కోతిని పాన్ షాప్‌కి తీసుకెళుతుంది, కోతి కుక్క వెనుక నిలబడి చిప్స్ ప్యాకెట్‌ను దొంగిలించడం ప్రారంభించింది. మొదటి ప్రయత్నంలో చిప్స్‌ని దొంగిలించలేకపోయినా, తర్వాత సఫలం అయ్యింది. అక్కడ ఉన్న ఓ వ్యక్తి కుక్క వీపుపై కోతి చిప్స్ దొంగిలిస్తున్న చేష్టలన్నింటినీ చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
The 🐒 trying to pick up a packet of chips with the help of 🐕 is the cutest thing you will watch today ❣️❣️. #goodmorning #dog #dogs #monkey #monkeys #animal #AnimalLovers #cute #lovable #adorable #friendship #bond #team pic.twitter.com/bkMAEU13NC
— Tarana Hussain (@hussain_tarana) May 8, 2022