Animal: ఓటీటీలోకి వచ్చేస్తున్న యానిమల్ మూవీ, ఎప్పుడో తెలుసా
- By Balu J Published Date - 09:58 PM, Sat - 13 January 24

Animal: అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో నటించిన యానిమల్ మూవీ అంచనాలకు మించి హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ త్వరలో ఓటీటీలోకి రాబోతోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా యానిమల్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ జనవరి 26 నుంచి స్ట్రీమింగ్ చేయబోతోంది. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ రేపో ఎల్లుండో ఆ లాంఛనం జరిగిపోతుంది. నార్త్ మల్టీప్లెక్సుల నిబంధనల ప్రకారం 45 రోజుల థియేట్రికల్ రన్ పూర్తయిపోవడంతో ఇంకే అడ్డంకులు లేవు.
900 కోట్లకు పైగా వసూళ్లతో అదరగొట్టిన యానిమల్ సహస్రం చేరుకోవాలని మూవీ లవర్స్ బలంగా కోరుకున్నారు. అయితే కేవలం ఇరవై రెండు రోజుల గ్యాప్ తో సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్, డంకీ వచ్చేయడంతో ఆ ఫీట్ సాధ్యపడలేదు. అయినా ఇప్పటికే థియేటర్లలో ఆడుతూనే ఉంది.
అసలు థియేటర్లో చూడని వాళ్ళు యానిమల్ ని ఓటిటిలో చూశాక ఎలాంటి రియాక్షన్లు ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవలే ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ ఈ సినిమా మీద విరుచుకుపడటం, దానికి యానిమల్ టీమ్ ఘాటుగా బదులు చెప్పడం వైరలయ్యింది. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపే కలెక్షన్లు సాధించినా యానిమల్ మూవీ ఓటీటీలో ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది.