Diwali-America : ఇక ఆ దేశంలో దీపావళికి స్కూల్ హాలిడే
Diwali-America : అమెరికాలోని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ కీలక నిర్ణయం ప్రకటించారు.
- By Pasha Published Date - 09:23 AM, Tue - 27 June 23
Diwali-America : అమెరికాలోని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ కీలక నిర్ణయం ప్రకటించారు. ఇక నుంచి రాష్ట్రంలోని స్కూల్స్ కు దీపావళికి హాలిడే ఇస్తామని వెల్లడించారు.దీపావళికి స్కూళ్లకు సెలవును ప్రకటించాలని కోరుతూ న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ సభ్యురాలు జెనిఫర్ రాజ్‌కుమార్ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని మేయర్ ఎరిక్ ఆడమ్స్ తెలిపారు.
Also read : Goldy Brar-Salman Khan : సల్మాన్ ఖాన్ టార్గెట్ అంటున్న గోల్డీ బ్రార్ ఎవరు ?
అందరికీ శుభ దీపావళి అంటూ మేయర్ ట్వీట్ చేశారు. చీకటిపై వెలుగు సాధించిన విజయాన్ని ఇకపై తామంతా కలిసి జరుపుకుంటామని చెప్పారు. దీనికి సంబంధించి న్యూయార్క్ అసెంబ్లీ రెడీ చేసిన బిల్లుపై గవర్నర్ కాథీ హోచుల్ సంతకం చేస్తారన్న నమ్మకం తనకు ఉందని మేయర్ పేర్కొన్నారు. ఈ కొత్త సెలవుదినం.. ఇప్పటికే స్కూల్ హాలిడే క్యాలెండర్‌లో ఉన్న “బ్రూక్లిన్-క్వీన్స్ డే” స్థానంలో(Diwali-America) అమలవుతుంది. ఈ సంవత్సరం నవంబర్ 12న దీపావళి పండుగ ఉంది.