Deer Hunting: తెలంగాణలో జింకల వేట.. పోలీసులకు చిక్కిన వేటగాళ్లు
- By Balu J Published Date - 12:21 PM, Fri - 29 December 23

Deer Hunting: విద్యుత్తు తీగలను ఉపయోగించి మచ్చల జింకను చంపినందుకు ములుగు జిల్లాలో ఆరుగురు వేటగాళ్లను అధికారులు అరెస్టు చేసిన మూడు రోజులకే, కెబి ఆసిఫాబాద్ జిల్లాలో మరో సంఘటన బయటపడింది. ఈసారి 15 మంది ఉన్నారు. జింకల మాంసం కోసం ట్రాప్ చేసి చంపడానికి వలలను ఉపయోగించారు.
తెలంగాణ అటవీ శాఖ వన్యప్రాణి విభాగం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘క్యాచ్ ద ట్రాప్’ డ్రైవ్‌లో ఈ రెండు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. నాన్-ఎలక్ట్రిఫైడ్ వైర్ వలలు, అలాగే రాష్ట్రంలోని అటవీ ప్రాంతాలలో అనేక ఇతర ఉచ్చులు గుర్తించారు. వన్యప్రాణుల వేట ప్రాబల్యంపై తెలంగాణ చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ మోహన్ చంద్ర పర్గైన్ వ్యాఖ్యానిస్తూ “ఇవి కేవలం రెండు సంఘటనలు అయినప్పటికీ, మేం కనుగొన్న ఉచ్చులు బలంగా ఉన్నాయి.
నాలుగు రోజుల క్రితమే జింకలను చంపేశారని, క్యాచ్ ద ట్రాప్ డ్రైవ్‌లో భాగంగా అడవుల్లో కూంబింగ్‌లో ఈ ఘటన బయటపడిందని ఆసిఫాబాద్ డివిజనల్ అటవీ అధికారి నీరజ్ తిబ్రేవాల్ వెల్లడించారు. చింతకుంట గ్రామంలోని జాదవ్ బాలు ఇంట్లో 2 కిలోల మచ్చల జింక మాంసం లభ్యం కావడంతో మరో ముగ్గురు వ్యక్తులు రాజేష్, బుగ్గయ్య, దినేష్‌లను అదుపులోకి తీసుకున్నారు.