Mulugu: మూలుగు జిల్లా సీఆర్పీఎఫ్ క్యాంప్ లో కాల్పుల కలకలం.. !
ములుగు జిల్లా వెంకటాపురంలోని సీఆర్పీఎఫ్ 39 బెటాలియన్ లో కాల్పులు కలకలం రేపాయి.
- Author : Hashtag U
Date : 26-12-2021 - 12:04 IST
Published By : Hashtagu Telugu Desk
ములుగు జిల్లా వెంకటాపురంలోని సీఆర్పీఎఫ్ 39 బెటాలియన్ లో కాల్పులు కలకలం రేపాయి.ఈ బెటాలియన్ లో పని చేస్తున్న ఎస్ ఐ, హెడ్ కానిస్టేబుల్ ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. ఈ ఘటనలో ఎస్ ఐ ఉమేష్ చంద్ర మరణించగా…కానిస్టేబుల్ స్టీఫెన్ కు తీవ్రగాయాలైయ్యాయి. గాయపడిన కానిస్టేబుల్ ని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. కాల్పులకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.