Cow vs Snake: ఆవు ముందుకు వచ్చి పడక విప్పిన నాగుపాము.. వీడియో వైరల్?
మాములుగా పాములను మనుషులు ఆమడ దూరం పరిగెడతారు. అయితే పాములు చూసి కేవలం మనుషులు మాత్రమే కాకుండా ఇతర చాలా ప్రాణులు కూడా భయపడు
- Author : Anshu
Date : 13-09-2023 - 4:30 IST
Published By : Hashtagu Telugu Desk
మాములుగా పాములను మనుషులు ఆమడ దూరం పరిగెడతారు. అయితే పాములు చూసి కేవలం మనుషులు మాత్రమే కాకుండా ఇతర చాలా ప్రాణులు కూడా భయపడుతూ ఉంటాయి. ముఖ్యంగా కోళ్లు, పక్షులు, ఎలుకలు, ఆవులు లాంటి జంతువులు సరీసృపాలు కూడా భయపడుతూ ఉంటాయి. పొరపాటున పాము కనుక కాటు వేస్తే ప్రాణాలు పోవాల్సిందే. ఆ భయంతోనే చాలా వరకు ఇతర జీవులు కూడా భయపడుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ఆవులకు లేదా గేదెలకు ఈ పాములు కనిపించినప్పుడు అవి భయంతో పరుగులు తీస్తూ ఉంటాయి.
కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అందులో ఆ ఆవు వింతగా ప్రవర్తించడం చూసి ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఒక ఆవు, పాము దగ్గర దగ్గరగా ఉంటాయి. రెండు ఒకదాని ముఖంలో ఒకటి ముఖం పెట్టి చూసుకుంటున్నాయి. పాము పడగ విప్పి ఆవుకు ఎదురుగా వచ్చి ముందుకు వెనక్కు బుసలు కొడుతోంది. ఇక ఆవు ఆ పామును చూసి భయపడకుండా, చంపేస్తుంది, కాటేస్తుంది అని భయం కూడా లేకుండా ఆ పాము దగ్గరికి మరింత దగ్గరగా వెళ్లిన ఆవు ఆ పాముని నాలుకతో నాకుతున్నట్లు నిమురుతుంది.
Difficult to explain. The trust gained through pure love 💕 pic.twitter.com/61NFsSBRLS
— Susanta Nanda (@susantananda3) August 3, 2023
ఆ పాము కూడా అలా నాకుతున్నప్పుడు ఒక వైపుకు తిరిగి ఉంటుంది. ఇందుకు సంబంధించిన వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోని చూసిన నెటిజన్స్ ఇది నిజంగా ఆశ్చర్యకరమైన వీడియో, ఆ బంధం చూడటానికి ఎంత విచిత్రంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసేయండి.