RFCL Protest: ఖని మెయిన్ చౌరస్తా లో కాంగ్రెస్ శ్రేణుల భారీ రాస్తా రోకో
RFCL బాధితులకు న్యాయం చేయాలనీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ గారి ఆధ్వర్యంలో గోదావరి ఖని మెయిన్ చౌరస్తా లో రాస్తా రోకో చేయడం జరిగింది.
- By Hashtag U Published Date - 04:43 PM, Sun - 28 August 22

RFCL బాధిత మృతుడి కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా తో పాటు కుటుంబం లో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించాలి
అరేస్ట్ చేసి స్టేషన్ కి తరలించిన పోలీసులు
_ బాధితులందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది
RFCL బాధితులకు న్యాయం చేయాలనీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ గారి ఆధ్వర్యంలో గోదావరి ఖని మెయిన్ చౌరస్తా లో రాస్తా రోకో చేయడం జరిగింది. ఈ కార్యక్రమనికి రామగుండం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ మరియు అడ్లూరి లక్ష్మణ్ గారు హాజరయ్యారు. ఈ సందర్బంగా రాజ్ ఠాకూర్ గారు మాట్లాడుతూ
రామగుండం శాసనసభ్యులు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మృతుడి ఆ కుటుంబానికి కోటి రూపాయలు చెల్లించి ఒక ఉద్యోగం ఇవ్వాలని అలాగే RFCL బాధితులoదరికి డబ్బులు చెల్లించాలని, వారికి న్యాయం చేయకపోతే ని ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేయాలనీ డిమాండ్ చేశారు. బాధితులు స్వయంగా ఎవరెవరికి ఎంతెంత డబ్బులు ఇచ్చి మోసపోయారో తెల్పినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతోనే ఈరోజు హరీష్ ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు.
దీనికి ఎమ్మెల్యే మరియు మంత్రి కొప్పుల ఈశ్వర్ పూర్తి బాధ్యత వహిస్తూ బాధితులకు డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేసారు..జరిగిన దందాలో స్థానిక
ఎమ్మెల్యే గారి పేరు వినబడుతున్నా, తన పాత్ర ఉన్నదంటున్నా తమకేమి తెలియదన్నట్లుగా కమిటీ వేస్తానని, బాధితులు క్యాంపు కార్యాలయంకు వచ్చి తమ బాధలు చెప్పుకోవాలని చెప్పడం ఎంతవరకు సమంజసం అన్నారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు..