HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Cm Kcr Fires On Modi And His Policies

KCR fires on Modi: ప్రధాని పదవి సరిపోదా.. ఇంకేం కావాలి ? మోదీపై కేసీఆర్ ఫైర్

గత కొంత కాలంగా ప్రధాని మోదీపై విమర్శలతో మండిపడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రత స్థాయిని మరింత పెంచారు.

  • Author : Naresh Kumar Date : 25-08-2022 - 7:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KCR and Modi
KCR and Modi

గత కొంత కాలంగా ప్రధాని మోదీపై విమర్శలతో మండిపడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రత స్థాయిని మరింత పెంచారు. ప్రస్తుతం హైదరాబాద్ లో నెలకొన్న పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో చాలా ప్రమాదకరమైన పరిణామాలు చూస్తున్నామని వ్యాఖ్యానించారు. తనంగా నిర్మించిన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ భవనాన్ని సీఎం ప్రారంభించిన అనంతరం కొంగర కలాన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ నిప్పులు చెరిగారు. ప్రధాని పదవి సరిపోదా.. ఇంకేం కావాలంటూ తీవ్రస్థాయిలో మోదీపై మండిపడ్డారు. మనం నిద్రపోతే పెద్ద ప్రమాదానికి లోనవుతామని.. తెలంగాణను కాపాడే బాధ్యత తనదేనని కేసీఆర్ స్పష్టం చేశారు. తమిళనాడు, బెంగాల్‌, ఢిల్లీలో ప్రభుత్వాలను కూలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయనీ చెప్పారు.హైదరాబాద్‌ లో 24 గంటల కరెంట్‌ ఉంటే.. ఢిల్లీలో ఉండదన్నారు. ప్రధాని కుట్రలు చేసి రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొడుతున్నారనీ, తాను బతికుండగా తెలంగాణను ఆగం కానివ్వమంటూ వ్యాఖ్యానించారు. చిన్న నిర్లక్ష్యం కారణంగా 58 ఏళ్లు తెలంగాణ పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. రైతు బంధు, రైతు బీమాలాంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవని కేసీఆర్ చెప్పుకొచ్చారు. 24 గంటలు వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణయేనని గుర్తు చేశారు.

పంటల తెలంగాణ కావాలా..? మంటల తెలంగాణ కావాలా అని సీఎం ప్రశ్నించారు. కేంద్రం ఇన్నేళ్లలో ఒక్క మంచిపనైనా చేసిందా ..మనం మౌనంగా భరిద్దామా అని కేసీఆర్ నిలదీశారు. ఇలాగే వదిలేస్తే తాను చెప్పినట్లుగా మత పిచ్చి మంటలే వస్తాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు . హిజాబ్, హలాల్ అంటూ బెంగళూరులో మతపిచ్చి లేపి వాతావరణాన్ని కలుషితం చేశారని సీఎం ఆరోపించారు. తెలంగాణలోనూ పరిశ్రమలు రాకుండా వుండాలా, ఐటీ రంగం పారిపోవాలా, పిల్లలకు ఉద్యోగాలు వద్దా, రంగారెడ్డి జిల్లా భూములు పడిపోవాలా అని కేసీఆర్ ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు వ్యక్తులు రాష్ట్రంలో మతచిచ్చు పెడుతున్నారని.. ఇలాంటి చూస్తూ ఊరుకోవాలా అని సీఎం నిలదీశారు. ఎనిమిదేళ్ల నుంచి తెలంగాణలో కఠినంగా వ్యవహరిస్తున్నామని, ప్రశాంతంగా వున్నామని కేసీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ తలసరి ఆదాయం, వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయని, మంచినీటి సదుపాయం వచ్చిందన్నారు. మత శక్తుల పిచ్చికి మనం లోనైతే మళ్లీ పాత తెలంగాణ మాదిరిగా తయారవుతామని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ద్వేషం, అసూయ, కర్ఫ్యూలతో ఎవరూ బాగుపడరని సీఎం అన్నారు. స్వార్ధ, నీచ మతపిచ్చిగాళ్లను తరిమికొట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • KCR fires on modi
  • pm modi
  • TRS vs BJP

Related News

Iran-Israel War

ప్రధాని మోదీకి ఎఫ్‌ఎస్‌యుఐ అత్యవసర లేఖ.. భార‌త్ యుద్ధంలోకి ఎంట‌ర్ అవుతుందా?

ఎఫ్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు బంకిమ్ భారతి, ప్రధాన కార్యదర్శి మనోజ్ యాదవ్ ప్రధాని మోదీకి ఒక విన్నపం చేశారు.

  • T20 World Cup 2026

    ప్ర‌ధాని మోదీని క‌ల‌వ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్స్‌?

Latest News

  • ఈ ఎన్నిక‌ల‌కు ప‌ర్పుల్ మార్క‌ర్‌ను ఉప‌యోగిస్తార‌ని మీకు తెలుసా?

  • Drugs Case : మొయినాబాద్ డ్రగ్స్ కేసు ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు !!

  • ఏప్రిల్ నుండి భారీగా పెర‌గ‌నున్న ధ‌ర‌లు!

  • Monalisa Marriage : ఏంటీ.. మోనాలిసా పెళ్లి చెల్లదా..?

  • Naa Anveshana Anvesh : మంత్రి లోకే‌ష్‌కు యూట్యూబర్ అన్వేష్ రిక్వెస్ట్

Trending News

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

    • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    • ఇకపై వీరికి ఎల్‌పిజి సిలిండర్లు లభించవు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd