10th Exam: తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి జరగనున్న 10వ తరగతి పరీక్షలు
తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు.
- By Hashtag U Published Date - 11:12 PM, Wed - 28 December 22

తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. 100శాతం సిలబస్‌తో పదోతరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.2022-23 విద్యా సంవత్సరం నుంచి 6 పేపర్ల విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఒక్కో పేపర్‌కు 3 గంటల పరీక్ష సమయం కేటాయించినట్లు వెల్లడించారు. సైన్స్ పేపర్‌కు 3 గంటల 20 నిమిషాల సమయం కేటాయించినట్లు పేర్కొన్నారు.10వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి, మార్చిలో ప్రీఫైనల్ పరీక్షలు ఉంటాయని తెలిపారు.