Cinema: ఏపీలో థియేటర్లను సీజ్ చేసిన అధికారులు
- By hashtagu Published Date - 03:42 PM, Thu - 23 December 21
ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల రేట్లు పై అటు సినిమా ఇండస్ట్రీ కి ఇటు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వివాదంలో థియేటర్ల యాజమాన్యాలు బలవుతున్నాయి. తాజాగా గురువారం ఏపీలో నిబంధనలు పాటించని పలు థియేటర్లను అధికారుల సీజ్ చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో 7, కుప్పంలో 4 థియేటర్లును సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు సీజ్ చేశారు. సీఎం జగన్‌తోనే సినీ పరిశ్రమ వివాదం పరిష్కారం అవుతుంది.. సినీ పరిశ్రమ పెద్దలు సీఎం జగన్‌ను కలిసి మాట్లాడాలి అని ఏపీ ఎగ్జిబిటర్ల సంఘం కార్యదర్శి సాయిప్రసాద్ అన్నారు.