SIM Cards: మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులున్నాయో మీకు తెలుసా…?
మనదేశ జనాభాలో దాదాపు సగం మంది ఫోన్ ఉపయోగిస్తున్నారు. డబ్బా ఫోన్ నుంచి ఆపిల్ ఫోన్ వరకు వాడుతున్నారు.
- By Hashtag U Published Date - 06:15 AM, Fri - 11 February 22
SIM Cards: మనదేశ జనాభాలో దాదాపు సగం మంది ఫోన్ ఉపయోగిస్తున్నారు. డబ్బా ఫోన్ నుంచి ఆపిల్ ఫోన్ వరకు వాడుతున్నారు. ముఖ్యంగా ఫోన్ కాల్స్ కోసం జియో, వొడాఫోన్, ఐడియా, బీఎస్ ఎన్ ఎల్, ఎయిర్ టెల్ ఇలా ఎవరికి నచ్చిన సిమ్ కార్డులు వారు వాడుకుంటున్నారు. అయితే చాలా మంది చాలా సిమ్ కార్డులు వాడుతుంటారు. గతంలో టెలికాం కంపెనీలు ఫ్రీ బ్యాలెన్స్, వ్యాలిడిటీ ఇచ్చిన సమయంలో చాలా సిమ్ కార్డులు తీసుకుని…బ్యాలెన్స్ , వ్యాలిడిటి ముగిసాక వాటిని పక్కనపెడుతున్నారు. కొంతమంది సిమ్ కార్డులు పోగొట్టుకుంటున్నారు. తర్వాత వేరే సిమ్ కార్డు తీసుకోవడం ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఈమధ్య కాలంలో ప్రతిఒక్కరికి తొమ్మిది సిమ్ కార్డులు మాత్రమే ఉండాలన్ననిబంధనను తీసుకువచ్చింది కేంద్రం. ఎక్కువ సిమ్ కార్డులు ఉంటే తొలగించాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
కాగా కొంతమందికి వారి పేరుతో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో వారికే తెలియదు. కానీ ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయ్యింది. ఒక వ్యక్తి పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో సులభంగా తెలుసుకోవచ్చు. ఒకవేళ వాడని సిమ్ కార్డులు ఉంటే వాటిని బ్లాక్ చేసుకోవచ్చు. ఆధార్ తో లింక్ అయిన సిమ్ కార్డుల దుర్వినియోగాన్ని ద్రుష్టిలో పెట్టుకుని టెలికాం శాఖ ఈ మధ్యే టూల్ అనలటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్ మెంట్ అండ్ కన్జూమర్ ప్రొటెక్షన్ ను అందుబాటులోకి తీసుకచ్చింది. ఆన్ లైన్ టూల్, పోర్టల్ తో వినియోగదారులు ఆధార్ నెంబర్ తో లింకైన మొబైల్ నెంబర్లను అన్నింటిని తెలుసుకునే వెసులుబాటును కల్పించింది.
ఇక ఈ వెబ్ సైట్ ద్వారా మీ ఆధార్ కార్డు ద్వారా ఎన్ని సిమ్ కార్డులను ఉపయోగించారో సులభంగా తెలుసుకోవచ్చు. మీకు తెలియకుండా మీ ఆధార్ నెంబర్ తో ఇతర ఫోన్ నెంబర్స్ లింకైనట్లు తేలిసినట్లయితే…మీరు వెంటనే కంప్లైట్ చేయవచ్చు. ఈ వెబ్ సైట్ ద్వారా మీరు పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. దీని వల్ల మీరు మోసపోకుండా జాగ్రత్తపడొచ్చు. మీరు https://tafcop.dgtelecom.gov.in/ సైట్ లోకి వెళ్లి మీ ఫోన్ నెంబర్ ను నమోదు చేయాలి. తర్వాత మీ మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీ ని నమోదు చేయాలి. ఇప్పుడు మీ పేరుతో ఉన్న మొబైల్ నెంబర్లన్నీ కూడా కనిపిస్తాయి. వాటిని మీరు బ్లాక్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది.
Related News
SIM Cards – 2024 : ‘సిమ్’ కోసం డాక్యుమెంట్స్ మోసుకెళ్లక్కర్లేదు
SIM Cards - 2024 : సిమ్ కార్డు.. ఇది కావాలంటే ఇప్పటిదాకా మనం ఐడీ ప్రూఫ్లను తీసుకెళ్లి సబ్మిట్ చేయాల్సి వచ్చేది.