Chandrababu Davos Tour : రెండో రోజు సీఎం షెడ్యూల్
Chandrababu Davos Tour : ఈ రోజు ఆయన 15కు పైగా ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో ముఖాముఖి భేటీలు నిర్వహించనున్నారు
- By Sudheer Published Date - 12:06 PM, Tue - 21 January 25

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) దావోస్ పర్యటన(Davos Tour)లో బిజీగా గడుపుతున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో భాగంగా ఆయన రెండో రోజు (Chandrababu 2nd Day) కూడా కీలక సమావేశాల్లో పాల్గొనబోతున్నారు. ఈ రోజు ఆయన 15కు పైగా ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో ముఖాముఖి భేటీలు నిర్వహించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు చంద్రబాబు ఈ పర్యటనను కీలకంగా తీసుకుంటున్నారు.
Budget 2025: బడ్జెట్ 2025.. ఆదాయపు పన్నుపై ఎంత మినహాయింపు ఇస్తారు?
రాష్ట్రానికి అవసరమైన పలు ముఖ్యమైన రంగాలపై సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ మాన్యుఫాక్చరింగ్, పెట్రో కెమికల్ హబ్, ఎనర్జీ ట్రాన్సిషన్, బ్లూ ఎకానమీ వంటి అంశాలపై జరిగే సదస్సుల్లో సీఎం పాల్గొనబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆవిష్కృతంగా అభివృద్ధి చేసే దిశగా చంద్రబాబు తీసుకుంటున్న చర్యలకు ఈ సదస్సు సహకరించనుంది.
టాటా, కార్ల్స్ బెర్గ్, LG, సిస్కో, వాల్మార్ట్, కాగ్నిజెంట్ వంటి ప్రపంచ స్థాయి కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ భేటీల్లో పెట్టుబడులపై చర్చలు జరగనుండగా, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పారిశ్రామిక హబ్‌ల ఏర్పాటుపై దృష్టి సారించనున్నారు. ఈ పర్యటన ప్రధానంగా పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. పర్యావరణ అనుకూలమైన అభివృద్ధి మోడల్స్, నూతన టెక్నాలజీ ప్రాజెక్టులు, రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ చంద్రబాబు చేస్తున్న ఈ ప్రయత్నాలు రాష్ట్రాన్ని దేశంలోనే ముందంజలో నిలిపేందుకు తోడ్పడతాయని భావిస్తున్నారు.