HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Case Registered On Rajyasabha Member Tg Venkatesh

TG Venkatesh : రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌, ఆయన సోదరుడి కుమారుడిపై కేసు

  • By Hashtag U Published Date - 08:15 AM, Mon - 18 April 22
  • daily-hunt
Tg Venkatesh
Tg Venkatesh

దాదాపు వంద కోట్ల రూపాయల విలువైన భూ వివాదానికి సంబంధించిన కేసులో రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్, ఆయన సోదరుడి కుమారుడు విశ్వప్రసాద్‌పై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. రోడ్డు నంబరు 10లో ఏపీ జెమ్స్ అండ్ జువెల్లర్స్ పార్క్‌ కోసం 2005లో అప్పటి ప్రభుత్వం రెండున్నర ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలంలో ఇప్పటికే నిర్మాణాలు చేపట్టారు. దీనికి ఆనుకుని ఉన్న మరో అరెకరానికిపైగా ఉన్న స్థలాన్ని కొందరు వ్యక్తులు.. టీజీ వెంకటేశ్ సోదరుడి కుమారుడు, సినీ నిర్మాత అయిన టీజీ విశ్వప్రసాద్‌తో ఇటీవల డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారు. దీంతో ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు కర్నూలు జిల్లా ఆదోని నుంచి దాదాపు 90 మంది మారణాయుధాలతో అక్కడికి చేరుకుని కాపలాదారులపై దాడికి పాల్పడ్డారు.

విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకోగా, గమనించిన కొందరు పరారయ్యారు. మిగిలిన 63 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయుధాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో టీజీ వెంకటేశ్, టీజీ విశ్వప్రసాద్, వీవీఎస్ శర్మ సహా మొత్తం 15 మంది ప్రమేయం ఉన్నట్టు గుర్తించి కేసులు నమోదు చేశారు. అలాగే, పట్టుబడిన వారిపై హత్యాయత్నం, అక్రమ ప్రవేశం, దాడి తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • banjara hills police
  • tg venkatesh

Related News

    Latest News

    • Imran Khan: ఇమ్రాన్ ఖాన్ చ‌నిపోలేదు.. కానీ: మాజీ ప్ర‌ధాని సోద‌రి

    • Lok Bhavan: రాజ్‌భవన్ నుండి లోక్‌భవన్.. అస‌లు పేరు ఎందుకు మార్చారు?!

    • Powerful Officers: ప్రధానికి అత్యంత సన్నిహితులు ఈ అధికారులే.. మొత్తం వ్యవస్థపై పట్టు వీరిదే!!

    • Telangana Global Summit: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌.. రెండు ఫుట్‌బాల్ అకాడమీలు ప్ర‌క‌టించే ఛాన్స్‌?!

    • IND vs SA T20 Series: సౌతాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌.. భార‌త్ జ‌ట్టును ఎప్పుడు ప్ర‌క‌టిస్తారు?!

    Trending News

      • Telangana Rising Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు 3,000 మంది ప్ర‌ముఖులు?!

      • Glenn Maxwell: ఐపీఎల్‌కు స్టార్ ప్లేయ‌ర్ దూరం.. లీగ్‌కు గుడ్ బై చెప్పిన‌ట్లేనా?!

      • AP CM Chandrababu Naidu : చంద్రబాబుపై అవినీతి కేసులు కొట్టేసిన హైకోర్టు..!

      • Hardik Pandya: టీమిండియాకు గుడ్ న్యూస్‌.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్‌!

      • Raj Nidimoru : సమంత రెండో భర్త రాజ్ నిడిమోరు బ్యాక్‌గ్రౌండ్ తెలుసా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd