Bengaluru Metro : బెంగుళూర్ మెట్రోలో ముద్దులతో రెచ్చిపోయిన యువజంట
చుట్టూ జనాలు ఉన్నారు..ఏమనుకుంటారో..ఇది తప్పు కదా..ఇలా చేయొచ్చా..అనేది ఏమాత్రం ఆలోచించకుండా ఇద్దరు రెచ్చిపోయారు
- Author : Sudheer
Date : 08-05-2024 - 10:26 IST
Published By : Hashtagu Telugu Desk
ఇటీవల ఢిల్లీ మెట్రో (Delhi Metro) వివాదస్పద ఘటనలకు కేరాఫ్ గా మారుతున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా లో వైరల్ కావాలనే ఉద్దేశ్యంతో కొంతమంది మెట్రో ట్రైన్ లలో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. రీల్స్ పేరుతో సభ్యసమాజం తలదించుకునేలా చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో వైరల్ కాగా..తాజాగా మరో యువజంట ట్రైన్లో ముద్దుల్లో తేలిపోవడం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
We’re now on WhatsApp. Click to Join.
కాకపోతే ఈసారి ఢిల్లీ మెట్రో లో కాదు బెంగుళూర్ మెట్రోలో. చుట్టూ జనాలు ఉన్నారు..ఏమనుకుంటారో..ఇది తప్పు కదా..ఇలా చేయొచ్చా..అనేది ఏమాత్రం ఆలోచించకుండా ఇద్దరు రెచ్చిపోయారు. అందరు చూస్తుండగానే ఒకరినొకరు హత్తుకుని ముద్దుల్లో రెచ్చిపోయారు. దీనిని కొంతమంది చూడలేక కళ్లు మూసుకుంటే..మరికొంతమంది తమ ఫోన్లలో బంధించారు. ఇలా అసభ్యంగా బిహేవ్ చేసిన సదరు జంటపై యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు.
https://twitter.com/Sam459om/status/1787134569872855179
Read Also : KA Paul Election Campaign : తాటి ముంజలు కొడుతూ KA పాల్ వినూత్న ప్రచారం…