Coins for Bike: చిల్లర నాణాలతో బైక్ కొన్న వ్యక్తి.. డబ్బులు లెక్కించడానికే మూడు రోజులు?
చాలామంది చిల్లర నాణేలు అంటే తేలిగ్గా కొట్టిపారెస్తూ చీప్ గా చూస్తూ ఉంటారు. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఎంత
- By Anshu Published Date - 08:45 AM, Sat - 16 July 22

చాలామంది చిల్లర నాణేలు అంటే తేలిగ్గా కొట్టిపారెస్తూ చీప్ గా చూస్తూ ఉంటారు. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఎంత పెద్ద అమౌంట్ ని అయినా కూడా మొదట రూపాయి విలువతోనే లెక్కగడుతూ ఉంటారు. అయితే చాలామంది చిల్లర నాణేలను తేలిగ్గా కొట్టి పారేస్తే అది వారి దురదృష్టం అనుకోవచ్చు. ఆ చిల్లర నాణేలతో ఏదైనా ఒక పని చేసి చూపిస్తే అప్పుడు తప్పకుండా అభిప్రాయాలు మారుతాయి. తాజాగా పశ్చిమబెంగాల్‌లోని నదియా జిల్లాకు చెందిన ఓ వ్యాపారి చిన్న డినామినేషన్‌లో చిల్లర నాణేలు పోగు చేసి, ఆ నాణేలతోనే ఏకంగా ఓ ఖరీదైన బైక్ ను కొనుగోలు చేసాడు. ఆరేళ్ల పాటు ఆలవోకగా ఆతను సేకరించిన సొమ్ము అక్షరాలా రూ.1.8 లక్షలు. పెద్ద నోట్లు రద్దు పుణ్యమా అంటూ 2016లో మొదలుపెట్టి ఇంత చిల్లరి పోగుచేశాడని తెలిసి ప్రతి ఒక్కరు నోరేళ్ళబెడుతున్నారు.
నడియాలోని స్థానిక దుకాణాలకు సొంతంగా తయారు చేసిన బీడీలను వ్యాపారి సుబ్రతా సర్కార్ అనే 46 ఏళ్ళ వ్యక్తి సరఫరా చేస్తుండేవాడు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. పెద్దనోట్ల రద్దు ప్రకటించినప్పుడు పెద్ద కరెన్సీ నోట్ల కొరత తీవ్రంగా ఉండేది. దీంతో నా కస్టమర్లు తక్కువ డినామినేషన్ ఉన్న చిల్లర నాణేలు చెల్లిస్తూ వచ్చారు. క్లయింట్స్ ఇచ్చిన దాంట్లో ప్రతిరోజూ కొంత మొత్తాన్ని కూడబెట్టడం మొదలుపట్టాను. అలా కొన్నేళ్ల తర్వాత ఆ మొత్తం సొమ్ముతో ఏదో ఒక వస్తువు కొనాలని అనుకునే వాడిని. గత నెలలో ఓ ద్విచక్వ వాహనాల దుకాణం మీదుగా వెళ్తున్నప్పుడు నేనెందుకు బైక్ కొనుకోకూడదనే ఆలోచన వచ్చింది. నా ఆలోచనను నా 17 ఏళ్ల కొడుకు శేఖర్‌తో పంచుకున్నాను.
ఆ తర్వాత నాణేలు లెక్కించడం మొదలుపెట్టాం. షోరూం యజమానిని కలుసుకుని మాట్లాడాం. బైక్ ఖరీదు నాణేల రూపంలో తీసుకునేందుకు అతను ఒప్పుకున్నాడు అని సుబ్రతా సర్కార్ తెలిపాడు. 5 బ్యాగ్‌లు, రెండు బస్తాల్లో నాణేలు నింపి ఒక రిక్షాలో బైక్ షోరూమ్‌కు తీసుకు వెళ్లినట్టు చెప్పాడు. తాను ఏదైతే ఆ కోరుకున్నానో ఆ బైక్‌ను తాను తాజాగా సొంతం చేసుకున్నట్టు తెలిపాడు. అయితే ఇదే విషయం పై బైక్ షోరూమ్ మేనేజర్ ప్రబిర్ బిశ్వాస్ మాట్లాడుతూ, ఐదుగురు ఉద్యోగులు దాదాపు మూడు రోజుల పాటు డబ్బు లెక్కించారని, నేటితో ఆ లెక్కింపు పూర్తయిందని తెలిపారు. నాణేల రూపంలో తనకు రూ.1.5 లక్షలు చెల్లించారని, చాలా సంతోషంగా బైక్ తాళాలు అప్పగించామని తెలిపారు బైక్ షోరూమ్ ఓనర్.