BOB: స్టూడెంట్స్ కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా జీరో బ్యాలెన్స్ అకౌంట్.. బెనిఫిట్స్ ఇవే..
ఈ ఖాతాకోసం మినిమం బ్యాలెన్స్ అవసరం లేదని, జీరో బ్యాంకింగ్ సేవలు వినియోగించుకోవచ్చని పేర్కొంది. BRO ద్వారా విద్యార్థులు కనీస బ్యాలెన్స్ లేకుండానే..
- By News Desk Published Date - 08:22 PM, Tue - 19 December 23

BOB: ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) విద్యార్థుల కోసం కొత్త సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ తీసుకొచ్చింది. BRO Savings Account పేరిట తీసుకొచ్చిన ఈ ఖాతాను తెరిచేందుకు 16 – 25 ఏళ్ల మధ్య వయసు కలిగిన విద్యార్థులు అర్హులని వెల్లడించింది. ఈ ఖాతాకోసం మినిమం బ్యాలెన్స్ అవసరం లేదని, జీరో బ్యాంకింగ్ సేవలు వినియోగించుకోవచ్చని పేర్కొంది. BRO ద్వారా విద్యార్థులు కనీస బ్యాలెన్స్ లేకుండానే బ్యాంక్ లో ఖాతా తెరవవచ్చని బ్యాంక్ ఆఫ్ బరోడా సీజీఎం రవీంద్ర సింగ్ నేగి తెలిపారు.
విద్యార్థుల అర్హతను బట్టి జీవితకాలం పాటు రూపే ప్లాటినమ్ డెబిట్ కార్డును అందిస్తారు. త్రైమాసికానికి 2 సార్లు కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ సదుపాయం ఉంటుంది. రూ.2 లక్షల వరకూ వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజ్ ఉంటుంది. ఫ్రీ చెక్ లీవ్స్, ఫ్రీ SMS/E-mail అలర్ట్స్ ఉంటాయి. అలాగే డీమ్యాట్ ఖాతా వార్షిక నిర్వహణ ఛార్జీలలో 100 శాతం రాయితీ లభిస్తుంది. స్టడీ లోన్స్ పై కూడా ప్రాసెసింగ్ ఫీజుతో పాటు వడ్డీపై రాయితీ లభిస్తుంది.