Bank Account: బ్యాంక్ అకౌంట్స్ ఎక్కువ ఉన్నాయా.. అయితే ఆధార్ ఏ అకౌంట్ కి లింక్ అయ్యిందో తెలుసుకోండిలా?
ఇంతకుముందు ఒక మనిషికి కేవలం ఒక బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఉండేవి. కానీ రాను రాను ఒక్కొక్క మనిషికి ఎక్కువ
- By Nakshatra Published Date - 05:26 PM, Thu - 10 November 22
ఇంతకుముందు ఒక మనిషికి కేవలం ఒక బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఉండేవి. కానీ రాను రాను ఒక్కొక్క మనిషికి ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉంటున్నాయి. అయితే బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ నెంబర్ లింక్ అన్నది తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. మరి ఎక్కువ బ్యాంక్ అకౌంట్ లు ఉన్నవారికి ఏ అకౌంట్ కి ఆధార్ నెంబర్ లింక్ అయింది అన్న విషయం సరిగా తెలిసి ఉండదు. అటువంటి అప్పుడు మన ఆధార్ ఏ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయినది తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే చాలామంది ఈ విషయం తెలుసుకోవడానికి బ్యాంకుల వరకు వెళ్తూ ఉంటారు.
బ్యాంకులకు వెళ్లకుండానే ఇంట్లో ఉండి కూడా మీ ఆధార్ ఏ బ్యాంకు లింకు అయిందో ఈజీగా తెలుసుకోవచ్చు. అయితే మనకు ఎన్ని అకౌంట్లు ఉన్నా ప్రతి ఒక్క బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ అన్నది తప్పనిసరిగా చేసుకోవాలి అని ప్రభుత్వాలు బ్యాంక్ అధికారులు కూడా చెబుతూనే ఉన్నారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్లో మీరు మీ ఆధార్ కార్డు నెంబర్ ను ఏ అకౌంట్ కు లింక్ చేశారో ఈజీగా తెలుసుకోవచ్చు. అందుకోసం ముందుగా మీ ఆధార్ నెంబర్ కు మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి.
మీ ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే తప్పనిసరిగా చేసుకోవాలి. మరి ఆధార్ ఏ బ్యాంకుకు లింక్ అయిందో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా యుఐడిఎఐ అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేసి హోమ్ పేజీలో ఆధార్ సర్వీస్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తరువాత చెక్ ఆధార్ బ్యాంక్ లింకింగ్ స్టేటస్ పై క్లిక్ చేయాలి. అప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అప్పుడు ఆధార్ నెంబర్ లేదంటే వర్చువల్ ఐడి ను ఎంటర్ చేయాలి. అనంతరం సెక్యూరిటీ కోడ్ను కూడా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీ ఆధార్ నెంబర్ కు ఏ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే ఆ నెంబర్ కు ఓటిపి వస్తుంది. ఓటిపి ని ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి. అప్పుడు మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంకు అకౌంట్ లింకు అయిందో ఆ బ్యాంకు యొక్క వివరాలు మీకు కనిపిస్తాయి. ఆధార్ నెంబర్ చివరి 4 అంకెలు బ్యాంకు లింక్ స్టేటస్ ఎప్పటినుంచి బ్యాంక్ అకౌంట్ ఆధార్ నెంబర్ లింక్ అయ్యింది. ఇలాంటి విషయాలు అన్నీ కూడా తెలుసుకోవచ్చు.
Related News
RBI New Rule: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మీ బ్యాంక్ అకౌంట్లో మైనస్ బ్యాలెన్స్ ఉన్నాయా..?
బ్యాంకులకు సంబంధించిన పనులు పూర్తి చేసేందుకు గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఒకప్పుడు ఉండేది.