Babli Barrage : బాబ్లీ గేట్లు ఎత్తివేత..
జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు గేట్లు తెరిచి ఉంచాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వుల (Supreme Court orders) మేరకు గేట్లను ఎత్తడం జరిగింది
- Author : Sudheer
Date : 01-07-2024 - 8:44 IST
Published By : Hashtagu Telugu Desk
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(SRSP) ఎగువన మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను(Babli gates opened ) సోమవారం ఎత్తారు. జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు గేట్లు తెరిచి ఉంచాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వుల (Supreme Court orders) మేరకు గేట్లను ఎత్తడం జరిగింది. కేంద్ర జల సంఘం అధికారులు, తెలంగాణ, మహారాష్ట్ర అధికారుల సమక్షంలో 14 గేట్లు పూర్తిగా ఎత్తారు. గేట్ల ఎత్తివేతతో నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద నీరు రాష్ట్రంలోకి ప్రవేశించి దిగువన ఉన్న శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు వైపు ప్రవహిస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
గేట్లు తెరిచిన నేపథ్యంలో నది పరివాహక ప్రాంతాల్లోని రైతులు, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, పోలీసులు సూచించారు. తిరిగి అక్టోబరు 29న మూసివేయనున్నారు. బాబ్లీలో ఉన్న 0.2 టీఎంసీల నీరు దిగువకు వస్తున్నదని ఎస్సారెస్పీ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌గుప్తా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సారెస్పీ ఎస్‌ఈ శ్రీనివాస్ గుప్త, సీడబ్ల్యూసీ ఈఈ వెంకటేశ్వర్లు, నాందేడ్ ఈఈ చక్రపాణి, ఏఈఈ బన్సద్, ఏఈఈ వంశీ, సతీష్ ఉన్నారు.
Read Also : Healthy Breakfast : ఓట్స్ తో గుంత పునుగులు.. డైట్ చేసేవారికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్