AP Minister Passes Away: ఏపీ మంత్రి హఠణ్మారణం.. గుండెపోటుతో మృతి
ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‍రెడ్డి కొద్దిసేపటి క్రితం మరణించారు. గుండెపోటు రావడంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
- By Hashtag U Published Date - 09:36 AM, Mon - 21 February 22

ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‍రెడ్డి కొద్దిసేపటి క్రితం మరణించారు. గుండెపోటు రావడంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల దుబాయ్ లో జరిగిన ఎక్స్ పో లో పాల్గొన్న గౌతమ్ రెడ్డి నిన్ననే తిరిగి హైదరాబాద్ చేరకున్నారు. ఈ రోజు ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ కోవిడ్ వల్లే ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది.
మంత్రిగా తన శాఖ వ్యవహారాలు చూసుకుంటు నెల్లూరు జిల్లానే కాక ఇతర జిల్లాల నేతలతో ప్రతిపక్ష నేతలతో సైతం కలివిడిగా ఉండే గౌతమ్ రెడ్డి మరణంతో దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్ రెడ్డి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు. 2014 ఎన్నికల్లో రాజకీయ ఆరంగ్రేటం చేసిన గౌతమ్ రెడ్డి, గత ఎన్నికల్లో ఆయన ఆత్మకూరు నుంచి పోటీ చేసి గెలిచారు. ఏపీ సీఎం జగన్ కెబినేట్ లో ఆయన తొలిసారిగా మంత్రి అయ్యారు.