Bandhavgarh Tiger Reserve: బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్‌లో పులి అనుమానాస్పద మృతి
మధ్యప్రదేశ్ అడవుల్లో పులుల సంఖ్య నానాటికి తగ్గుతుంది. బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్‌లోని మన్‌పూర్ పరిధిలో ఆదివారం మరో పులి కళేబరం లభ్యమైంది
- By Praveen Aluthuru Published Date - 07:33 AM, Mon - 28 August 23

Bandhavgarh Tiger Reserve: మధ్యప్రదేశ్ అడవుల్లో పులుల సంఖ్య నానాటికి తగ్గుతుంది. బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్‌లోని మన్‌పూర్ పరిధిలో ఆదివారం మరో పులి కళేబరం లభ్యమైంది. రెండు పులులు కొట్టుకోవడమే మృతికి కారణమని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. నెలన్నర వ్యవధిలో ఇక్కడ పరస్పర ఘర్షణలో మూడు పులులు మరణించాయి. ఈ ఏడాది ఈ పార్కులో మొత్తంగా ఎనిమిది పులులు మరణించినట్లు ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు.
మన్‌పూర్ బఫర్ రెంట్‌కు చెందిన బీట్ పతేరా ఏ పీఎఫ్ నంబర్ 641లో ఈ ఘటన జరిగింది. ఈ విషయమై అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ.. లభ్యమైన మృతదేహం మగపులిదేనని తెలిపారు. ఉమారియా జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు తొమ్మిది పులులు చనిపోయాయి, అందులో బాంధవ్‌గఢ్‌లో ఎనిమిది పులులు చనిపోగా, గత నెల పది రోజుల్లో మన్పూర్ పరిధిలో ఎనిమిది పులులు చనిపోయాయి. అయితే పరిసర గ్రామాల్లో పులులు వచ్చి అలజడి సృష్టిస్తుండటంతో ఆగ్రహించిన గ్రామస్తులు కర్రలతో కొట్టి చంపినట్లు కూడా అనుమానిస్తున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా మరణించిన పులిని చూసేందుకు గ్రామంలోని ప్రజలు గుమిగూడారు.
Also Read: Today Horoscope : ఆగస్టు 28 సోమవారం రాశి ఫలాలు.. వారికి శ్రమ పెరుగుతుంది