AP Cylinder Blast:అనంతపురం జిల్లాలో సిలిండర్ పేలి నలుగురి మృతి.. మృతుల్లో మూడేళ్ల పాప!!
అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శనివారం సూర్యుడు ఉదయించక ముందే ఆ కుటుంబంలోని వారి బతుకులు తెల్లారిపోయాయి.
- By Hashtag U Published Date - 12:02 PM, Sat - 28 May 22

అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శనివారం సూర్యుడు ఉదయించక ముందే ఆ కుటుంబంలోని వారి బతుకులు తెల్లారిపోయాయి. నిద్రమత్తులో ఉండగా ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో నలుగురు మృతి చెందారు. మృతుల్లో మూడేళ్ళ పసికందు కూడా ఉంది. కల్యాణ దుర్గం నియోజకవర్గంలోని శెట్టూరు మండలం ములకలేడులో శనివారం తెల్లవారుజామున ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
సిలిండర్ పేలుడు ధాటికి ఆ ఇంటితో పాటు పక్కన ఉన్న మరో ఇల్లు కూడా నేలమట్టం అయింది. మృతి చెందిన వారిలో కుటుంబ పెద్ద జైనాభి (60), ఆమె కుమారుడు దాదు (36), కోడలు సర్ఫున్నీ (28) మూడేళ్ళ మనవరాలు ఫిర్దోస్ ఉన్నారు.మరో ఇద్దరికి తీవ్రగాయాలవగా కళ్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పేలుడు ఎలా జరిగింది. రాత్రి పడుకునే ముందు రెగ్యులేటర్ ఆఫ్ చేయలేదా ? సిలిండర్లోనే ఏదైనా సమస్య ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.