Air India: ఎయిర్ ఇండియా భోజనంలో పురుగు.. ప్రయాణికుడు రచ్చరచ్చ?
మామూలుగా హోటల్స్ లలో, ఇతర భోజనశాలల్లో అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. చాలా వరకు భోజనాలలో పురుగులు పడటం, బల్లీలు పడటం అనే ఘటనలు చోటు చేసుకుంటాయి.
- By Anshu Published Date - 08:37 PM, Tue - 28 February 23

Air India: మామూలుగా హోటల్స్ లలో, ఇతర భోజనశాలల్లో అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. చాలా వరకు భోజనాలలో పురుగులు పడటం, బల్లీలు పడటం అనే ఘటనలు చోటు చేసుకుంటాయి. కేవలం అక్కడే కాకుండా ఎయిర్ ఇండియాలో సరఫరా చేసే భోజనంలో కూడా పొరపాటు జరుగుతూ ఉంటాయి. ఇప్పటికి చాలామంది ఎయిర్ ఇండియా భోజనం పై ఫిర్యాదు చేయగా.. తాజాగా ఓ ప్రయాణికుడి చేసిన ఫిర్యాదు కూడా వైరల్ గా మారింది.
ఇటీవలే ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ కూడా తను ప్రయాణించిన ఎయిర్ ఇండియాలో భోజనం సరిగా లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ ప్రయాణికుడు కూడా ఎయిర్ ఇండియా భోజనం పై ఫైర్ అయ్యారు. ముంబై కి చెందిన మహావీర్ జైన్ అనే వ్యక్తి సోమవారం ముంబై నుంచి చెన్నైకి వెళ్లే విమానంలో బిజినెస్ క్లాస్ లో ప్రయాణించగా..
ఆ సమయంలో తనకు సరఫరా చేసిన ఆహారంలో పురుగు వచ్చింది అని ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశాడు. ఇక దానికి సంబంధించిన వీడియోను కూడా ఆయన షేర్ చేయగా.. ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్ లో సరఫరా చేసిన ఆహారంలో పురుగు అని ట్వీట్ చేశాడు. ఇక వెంటనే ఎయిర్ ఇండియా ఈ ఘటనపై స్పందిస్తూ.. అతనికి క్షమాపణలు తెలిపింది.
డియర్ మిస్టర్ జైన్, మీకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణ చెబుతున్నాం.. ఇది ఏమాత్రం మంచి విషయం కాదు.. ప్రయాణికులకు పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు కఠిన చర్యలు చేపడతామని స్పందించింది. ఇక వెంటనే ఈ ఘటన గురించి తెలుసుకున్న నెటిజన్స్.. తమకు కూడా ఆహార విషయంలో, ఇతర విషయంలలో ఎదురైన చేదు అనుభవాలను కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు.