“World’s Highest Located” Shiva Temple:అత్యంత ఎత్తైన ప్రదేశంలో శివాలయం.. నార్వే దౌత్యవేత్త వీడియో వైరల్!!
ఇది తుంగనాథ్ మహాదేవ ఆలయం. పంచ కేదార క్షేత్రాలలో ఇది ఒకటి. రుద్ర ప్రయాగ జిల్లా పరిధిలో ఈ ప్రాచీన టెంపుల్ ఉంది.
- By Hashtag U Published Date - 01:04 PM, Tue - 4 October 22

చుట్టూ తెల్లటి మంచు దుప్పటి..
ఆహ్లాదకరమైన వాతావరణం.
ఆ మధ్యలో ఒక ప్రాచీన శివాలయం..
ఈ దృశ్యం మన దేశంలో దేవభూమిగా పిలిచే ఉత్తరాఖండ్ లోనిది.
ఇది తుంగనాథ్ మహాదేవ ఆలయం. పంచ కేదార క్షేత్రాలలో ఇది ఒకటి. రుద్ర ప్రయాగ జిల్లా పరిధిలో ఈ ప్రాచీన టెంపుల్ ఉంది.
మందాకిని, అలకనంద నదీ లోయల మధ్య ఉండే తుంగనాథ్ పర్వతలపై ఉండటంతో ఈ శివాలయానికి అదే పేరు వచ్చింది. ఇక్కడ ఏటా మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి.
తాజాగా ఈ ఆలయానికి సంబంధించిన ఒక డ్రోన్ వీడియోను నార్వే దౌత్యవేత్త ఎరిక్ సోల్హిమ్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. వీడియో బ్యాక్ గ్రౌండ్లో “నమో నమో శంకర” అనే సాంగ్ ను కూడా చేర్చారు. ఈ ఆలయం 5000 ఏళ్ల నాటిదని ఆయన చెప్పుకొచ్చారు. పోస్ట్ చేసిన వెంటనే ఈ వీడియోకు 7.47 లక్షల వ్యూస్ వచ్చాయి. 52వేల మంది లైక్ చేశారు. 6వేల మంది షేర్ చేశారు. వందలాది మంది నెటిజన్స్ కామెంట్స్ చేశారు. కొందరు వీడియో సూపర్.. ఆలయం అద్భుతం అని మెచ్చుకున్నారు. ఇంకొందరు ఆలయం 5000 ఏళ్ల నాటిదనే వాదనతో విభేదించారు. తప్పుడు సమాచారం ఇవ్వడం సరికాదన్నారు.వాస్తవానికి ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలోని శివాలయంగా గుర్తింపు పొందింది. సముద్ర మట్టానికి 3680 మీటర్ల ఎత్తులో ఉంది. బహుశా 1000 ఏళ్ల కిందట నిర్మించినట్లు ప్రభుత్వ గణాంకాలను బట్టి తెలుస్తోంది.
Incredible India 🇮🇳!
World's Highest Located Mahadev Mandir.., believed to be 5000 years old !
Uttarakhand— Erik Solheim (@ErikSolheim) October 2, 2022