Ladakh Earthquake : లఢక్ లో భారీ భూకంపం..!!
శుక్రవారం తెల్లవారుజామున జమ్ముకశ్మీర్ లోని లడఖ్‌లో భారీ భూకంపం సంభవించింది.
- By hashtagu Published Date - 08:05 AM, Fri - 16 September 22

శుక్రవారం తెల్లవారుజామున జమ్ముకశ్మీర్ లోని లడఖ్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.8గా నమోదైంది. భూకంపం ప్రకంపనలతో ప్రజల్లో భయాందోళనలకు గురయ్యారు. ప్రజలు తమ ఇళ్లలో నిద్రిస్తున్నప్పుడు భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం కేంద్రం అల్చి (లేహ్)కి ఉత్తరాన 189 కి.మీ. దీని లోతు భూమికి 10 కి.మీ.. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అంతకుముందు జమ్మూ కాశ్మీర్‌లో గత వారం భూకంపం సంభవించింది. దోడా, కిష్త్వార్‌లలో గురువారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.5గా నమోదైంది.