Gujarat: పక్షుల ప్రేమికుడు.. భగవంజీ!
- By Balu J Published Date - 05:47 PM, Sat - 8 January 22

గుజరాత్‌కు చెందిన భగవంజీ 40 అడుగుల ఎత్తులో ఈ బర్డ్ హౌస్‌ని నిర్మించడానికి రూ. 20 లక్షలు వెచ్చించారు. అతను తన సొంత డబ్బు, భూమితో భారీ పక్షుల గృహాన్ని నిర్మించాడు. పక్షులకు సురక్షితమైన స్వర్గధామం ఇవ్వడానికి ఆయన శ్రమిస్తున్నారు. ఈయన అన్ని జీవులకు సమాన ప్రాతినిధ్యం వహించాలని నమ్మే ప్రకృతి ప్రేమికుడు. పక్షులకు ఆశ్రయం కల్పించడమే కాకుండా, ఆహారం, నీరు కూడా అందిస్తూ మనవత్వాన్ని చాటుకుంటున్నాడు. ఈయన ఏర్పాటు చేసిన బర్డ్ హౌజ్ లో ప్రస్తుతం వేల సంఖ్యలో పక్షులు ఆశ్రయం పొందుతున్నాయి. కొన్ని రకాల పక్షులను వేటగాళ్లు వేటాడుతుండటం అతన్ని కలిచివేసింది. అలాంటివాళ్ల బారి నుంచి కాపాడుతున్నాడు.