Ukraine Crisis: మరో రెండురోజుల్లో స్వదేశానికి రానున్న 7400 మంది భారతీయులు
ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు పక్రియ ఇంకా కొనసాగుతుంది.
- By Hashtag U Published Date - 10:10 PM, Thu - 3 March 22

ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు పక్రియ ఇంకా కొనసాగుతుంది. మరో రెండు రోజుల్లో 7,400 మందికి పైగా భారతీయులను ఉక్రెయిన్ పొరుగు దేశాల నుంచి ప్రత్యేక విమానాల్లో భారత్‌కు తీసుకురావాలని భావిస్తున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. భారత విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్, ఇండిగో, విస్తారా మరియు గో ఫస్ట్ ల నుంచి శుక్రవారం మొత్తం 17 విమానాలను నడపనున్నట్లు మంత్రిత్వ శాఖ ప్రకటన పేర్కొంది.
రష్యా సైనిక దాడి కారణంగా ఫిబ్రవరి 24 నుండి ఉక్రెయిన్ గగనతలం మూసివేయబడినందున.. ఉక్రెయిన్ యొక్క పశ్చిమ పొరుగు దేశాలైన రొమేనియా, హంగేరి మరియు పోలాండ్ నుండి భారతదేశం ప్రత్యేక విమానాల ద్వారా తన పౌరులను తరలిస్తోంది. పౌర విమానాల సంఖ్యను మరింత పెంచుతున్నారు,. మరో రెండు రోజుల్లో 7,400 మందికి పైగా ప్రత్యేక విమానాల ద్వారా తీసుకురాబడతారని మంత్రిత్వ శాఖ ప్రకటన పేర్కొంది. శుక్రవారం 3,500 మందిని మరియు శనివారం 3,900 మందిని తిరిగి భారతదేశానికి తీసుకురావాలని భావిస్తున్నారు. ఫిబ్రవరి 22 నుండి భారత వైమానిక దళం (IAF) నిర్వహించే వారితో సహా ఇప్పటివరకు 6,998 మందిని ప్రత్యేక విమానాలలో తిరిగి తీసుకువచ్చిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. నలుగురు కేంద్ర మంత్రులు ఉక్రెయిన్ పశ్చిమ పొరుగు దేశాలకు వెళ్లి భారతీయ పౌరుల తరలింపును సులభతరం చేశారు. హర్దీప్ సింగ్ పూరి హంగేరీలో, జ్యోతిరాదిత్య సింధియా రొమేనియాలో, కిరెన్ రిజిజు స్లోవేకియాలో, వికె సింగ్ పోలాండ్‌లో ఉండి భారతీయులను తరలిస్తున్నారు