Manipur violence: మణిపూర్‌లో హింసాత్మక ఘటనలో 54 మంది మృతి: సీఎం అత్యవసర భేటీ
మణిపూర్‌లో హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు 54 మంది చనిపోయారు. కాగా రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పేందుకు సమన్వయ కమిటీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ సమావేశమయ్యారు
- By Praveen Aluthuru Published Date - 09:46 PM, Sat - 6 May 23

Manipur violence: మణిపూర్‌లో హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు 54 మంది చనిపోయారు. కాగా రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పేందుకు సమన్వయ కమిటీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం ట్వీట్ చేశారు. “మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితిని కంట్రోల్ లోకి తీసుకొనేందుకు అలాగే ప్రజలను దృష్టిలో ఉంచుకుని మణిపూర్ ఇంటిగ్రేషన్ (COCOMI) పై సమన్వయ కమిటీ ప్రతినిధులతో సమావేశమయ్యాను” అని ముఖ్యమంత్రి బీరెన్ ట్వీట్ చేశారు.
Held an all-political party meeting to discuss the current situation in Manipur and to collectively work towards bringing peace & stability in the state. During the meeting, it was resolved to appeal for peace in the state, and encourage all citizens to avoid any actions that… pic.twitter.com/6euhaR238J
— N. Biren Singh (@NBirenSingh) May 6, 2023
మణిపూర్‌లో హింసాకాండ కారణంగా మరణించిన వారి సంఖ్య 54కి చేరుకుందని అధికారులు శనివారం తెలిపారు. అదే సమయంలో, అనధికారికంగా హింసలో పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించారని, అదేవిధంగా హింసలో 150 మందికి పైగా గాయపడ్డారని తెలుస్తుంది. అధికారికంగా మరణించిన వారి సంఖ్య 54 అని అధికారులు తెలిపారు, అందులో 16 మృతదేహాలను చురాచంద్‌పూర్ జిల్లా ఆసుపత్రి మార్చురీలో ఉంచగా, 15 మృతదేహాలు ఇంఫాల్ తూర్పు జిల్లాలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఉన్నాయి.
ప్రస్తుతం అక్కడ జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంది. అదనపు బలగాలు, సెంట్రల్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది మోహరించడంతో అన్ని ప్రధాన ప్రాంతాలు, రహదారుల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 10,000 మంది ఆర్మీ, పారా మిలటరీ, కేంద్ర పోలీసు బలగాలను మోహరించారు.