Mulugu : ముత్యాల ధార జలపాతం వద్ద చిక్కుకున్న 40 మంది పర్యాటకులు
ములుగు జిల్లాలోని ముత్యాల ధార జలపాతంలో బుధవారం నీటి ప్రవాహం పెరగడంతో 42 మంది పర్యాటకులు
- By Prasad Published Date - 08:47 AM, Thu - 27 July 23

ములుగు జిల్లాలోని ముత్యాల ధార జలపాతంలో బుధవారం నీటి ప్రవాహం పెరగడంతో 42 మంది పర్యాటకులు చిక్కుకుపోయారని పోలీసులు తెలిపారు. జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, NDRF తో పాటు స్థానిక పోలీసులు సంఘటనా స్థలంకి వెళ్లి.. పర్యాటకులను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. తాము మొబైల్‌లో పర్యాటకులతో మాట్లాడామని.. నీటి ప్రవాహానికి దూరంగా ఉండాలని రెస్క్యూ టీమ్ కోరారు. ఉదయం నాటికి పర్యాటకులందరూ రక్షించబడతారని..ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని ములుగు ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. చిక్కుకుపోయిన పర్యాటకులను రెస్క్యూ టీమ్‌లు వెంటనే చేరుకుంటాయని, అప్పటి వరకు వారు ఎత్తైన ప్రదేశంలో ఉండాలని, మొబైల్ బ్యాటరీలను భద్రంగా ఉంచుకోవాలని ఎస్పీ సూచించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని, ఆహార పదార్థాలు, ఇతర రెస్క్యూ పరికరాలు పంపిస్తున్నందున ధైర్యంగా ఉండాలని కోరారు.