20 Sheeps Killed: గద్వాల్ లో రెచ్చిపోయిన వీధికుక్కలు.. 20 గొర్రెలు మృతి!
రాష్ట్రవ్యాప్తంగా వీధి కుక్కలు (Dogs) రెచ్చిపోతున్నాయి. కనిపించిన ప్రతి మనిషిపై దాడులకు దిగుతున్నాయి.
- By Balu J Updated On - 12:30 PM, Thu - 9 March 23

తెలంగాణ (Telangana) రాష్ట్రవ్యాప్తంగా వీధి కుక్కలు (Dogs) రెచ్చిపోతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు కనిపించిన ప్రతి మనిషిపై దాడులకు దిగుతున్నాయి. చివరకు జంతువులను కూడా వదలడం లేదు. ఒక్క హైదరాబాద్ లోనే రోజుకు 100 కుక్క కాట్లు కేసు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా కుక్కల దాడిలో 20 గొర్రెలు (Sheeps) చనిపోయాయి. మరో 20 గాయపడినట్టు సమాచారం.
గద్వాల్ జిల్లాలో లీజా మున్సిపాలిటీ పరిధిలోని మేకలనాగిరెడ్డి భూమిలో మంగళవారం రాత్రి వీధికుక్కలు స్వైర విహారం చేశాయి. కుక్కల దాడిలో 20 గొర్రెలు (Sheeps) చనిపోగా, మరో 20కి పైగా గాయపడ్డాయి. గొర్రెల కాపరి కె.స్వాములు తెలిపిన వివరాల ప్రకారం.. ఎప్పటిలాగే తన గొర్రెలను (Sheeps) మేత కోసం వదిలివేశానని, కుక్కలు చంపడంతో రూ.2 లక్షల నష్టం వాటిల్లింది అని ఆవేదన వ్యక్తం చేశాడు.
Also Read: RRR Oscar Promotions: ఆస్కార్ కోసం 80 కోట్లు ఖర్చపెడుతారా? ఆర్ఆర్ఆర్ పై తమ్మారెడ్డి ఫైర్

Related News

19 Sheeps Killed: రెచ్చిపోయిన వీధి కుక్కలు.. 19 గొర్రెలు మృతి
రాష్ట్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూనే ఉన్నాయి. మనుషులతో పాటు జంతువులపై దాడి చేస్తున్నాయి. తాజాగా వీధి కుక్కల దాడిలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 19 గొర్రెలు చనిపోయాయి. జగిత్యాల జిల్లా సోమవారం అర్థరాత్రి ఇబ్రహీంపట్నం మండలం కోమటికొండాపూర్‌లో వీధికుక్కల దాడిలో సుమారు 19 గొర్రెలు మృతి చెందగా, నాలుగు గాయపడిన ఘటన సంచలనం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్ర�