Hyd : రన్నింగ్ కారులో మంటలు.. ఇద్దరు సజీవదహనం
Hyd : వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న ఒక రన్నింగ్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి
- By Sudheer Published Date - 08:18 PM, Mon - 6 January 25

హైదరాబాద్ (Hyderabad) నగరంలోని మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పరిధి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు(ORR Service Road)లో ఘోర ప్రమాదం (Accident) చోటుచేసుకుంది. వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న ఒక రన్నింగ్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు సజీవదహనమయ్యారు. కారు వేగంగా ఉండటంతో కంట్రోల్ చేయడానికి అవకాశం లేకపోవడంతో మంటలు పూర్తిగా వ్యాపించాయి.
Aramghar : జూపార్క్ పైవంతెనను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మంటల తీవ్రత కారణంగా కారులో ఉన్న ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. ఫైర్ ఇంజన్ వచ్చేసరికి కారు పూర్తిగా కాలిపోయి, కారులో ఉన్న వ్యక్తులు గుర్తు తెలియని స్థితిలో మిగిలారు. ఈ ఘటన స్థానికులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. స్థానికులు మంటలను ఆర్పేందుకు, ప్రయాణికులను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు, ఫైర్ ఇంజన్ మంటలు ఆర్పినప్పటికీ అప్పటికే ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. మృతులను ఉప్పల్ వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరి మరణ వార్తతో వారి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.