Ukraine Evacuation: ఉక్రెయిన్ నుంచి 15 వేల మంది భారతీయులు తరలింపు – కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా
ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో భారతీయులను స్వదేశానికి తిరిగి తీసుకురావడంలో కేంద్రం ప్రయత్నం విజయవంతమైంది.
- Author : Hashtag U
Date : 06-03-2022 - 10:11 IST
Published By : Hashtagu Telugu Desk
ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో భారతీయులను స్వదేశానికి తిరిగి తీసుకురావడంలో కేంద్రం ప్రయత్నం విజయవంతమైంది.
76 విమానాల ద్వారా 15,920 మంది విద్యార్థులను విజయవంతంగా తరలించామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆదివారం ట్వీట్ చేశారు. భారతీయ విద్యార్థులను తమ పిల్లలుగా చూసుకున్నందుకు రొమేనియాకు కేంద్రమంత్రి సింధియా కృతజ్ఞతలు తెలిపారు.
ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన తర్వాత భారత ప్రభుత్వం ఆపరేషన్ గంగా కింద ఉక్రెయిన్ నుండి పొరుగు దేశాలైన రొమేనియా మరియు పోలాండ్ ద్వారా భారతీయ పౌరులను, విద్యార్థులను ఖాళీ చేయిస్తోంది. ఫిబ్రవరి 28న, కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, జ్యోతిరాదిత్య సింధియా, కిరెన్ రిజిజు మరియు జనరల్ VK సింగ్‌లను తరలింపు కార్యకలాపాలను సమన్వయం చేయడానికి ఉక్రెయిన్ పొరుగు దేశాలకు వెళ్లారు. కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాను రొమేనియా పంపారు.
#OperationGanga Update: We have successfully evacuated over 15920 students via 76 flights. Breakup –
Romania – 6680 (31 flights)
Poland – 2822 (13 flights)
Hungary – 5300 (26 flights)
Slovakia – 1118 (6 flights) @HardeepSPuri @KirenRijiju @Gen_VKSingh— Jyotiraditya M. Scindia (@JM_Scindia) March 6, 2022