Viral Video : హెలికాప్టర్ లో చక్కర్లు కొట్టిన 10, 12 తరగతి విద్యార్థులు..!!
10వ తరగతి మరియు 12వ తరగతి ఫలితాలను ఛత్తీస్‌గఢ్ బోర్డు కొన్ని నెలల క్రితం ప్రకటించింది. ఈ ఫలితాల్లో చాలా మంది పిల్లలు టాపర్లుగా నిలిచారు.
- By hashtagu Published Date - 03:50 PM, Sat - 8 October 22

10వ తరగతి మరియు 12వ తరగతి ఫలితాలను ఛత్తీస్‌గఢ్ బోర్డు కొన్ని నెలల క్రితం ప్రకటించింది. ఈ ఫలితాల్లో చాలా మంది పిల్లలు టాపర్లుగా నిలిచారు. అగ్రస్థానంలో నిలిచిన విద్యార్థులను ఇవాళ హెలికాఫ్టర్ రైడ్ కు తీసుకెళ్లారు అధికారులు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా నిర్ణీత పరిమితుల్లోనే నెరవేర్చింది. హెలికాఫ్టర్లు పిల్లలు సంతోషం వ్యక్తం చేశారు. కరచాలనం చేసి ప్రజల అభినందనలు స్వీకరించారు. అలాగే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ చొరవను ప్రజలు కొనియాడుతున్నారు. మంచి మార్కులతో ఉత్తీర్ణులైతే వారిని హెలికాప్టర్ రైడ్‌కి తీసుకెళ్తానని సీఎం భూపేష్ బఘేల్ గతంలో ప్రకటించారు. సీఎం చెప్పినట్లుగా తన మాటను నిలబెట్టుకున్నారు.
10वीं और 12वीं कक्षा के टॉपर बच्चों ने की हेलिकॉप्टर राइड….
सीएम @bhupeshbaghel ने घोषणा की थी कि जो भी बच्चे अच्छे अंक से पास होंगे, जो भी बच्चे टॉप करेंगे उन्हें मैं हेलिकॉप्टर में सैर करवाउँगा.#Chhattisgarh #Motivational #Students #topper #school #helicopter #bhupeshbaghel pic.twitter.com/Ma4v0rasuh— Tanmay (@SakalleyTanmay) October 8, 2022