HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >10 New Telangana High Court Judges Sworn In

HC Judges: హైకోర్టులో 10 మంది జ‌డ్జిల ప్ర‌మాణం

సుప్రీం కోర్టు కొలిజియం ఎంపిక చేసిన 10 మంది జ‌డ్జిలు తెలంగాణ హైకోర్టులో గురువారం ప్రమాణం చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ స‌తీష్ శ‌ర్మ‌ కొత్తగా నియమితులైన 10 మంది జడ్జిలతో ప్రమాణం చేయించారు.

  • Author : CS Rao Date : 24-03-2022 - 11:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
High Court Hyderabad
High Court Hyderabad

సుప్రీం కోర్టు కొలిజియం ఎంపిక చేసిన 10 మంది జ‌డ్జిలు తెలంగాణ హైకోర్టులో గురువారం ప్రమాణం చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ స‌తీష్ శ‌ర్మ‌ కొత్తగా నియమితులైన 10 మంది జడ్జిలతో ప్రమాణం చేయించారు. ప్ర‌మాణం చేసిన జ‌డ్జిల్లో కాసోజు సురేందర్, సూరేపల్లి నంద, ముమ్మినేని సుధీర్ కుమార్,శ్రీదేవి, ఎస్‌.వి.శ్రావణ్ కుమార్, జి. అనుపమా చక్రవర్తి, మాటూరి గిరిజా ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఏనుగు సంతోష్ రెడ్డి, డాక్టర్ దేవరాజ్ నాగార్జున లు ఉన్నారు.
కొత్తగా 10 మంది జడ్జిలు ప్రమాణం చేయడంతో తెలంగాణ హైకోర్టు జడ్జిల సంఖ్య 29కి చేరింది. ఇటీవ‌ల సుప్రీం కోర్టు పది మంది జడ్జిల నియామకం కోసం సిఫారసు చేసింది. ఆ సిఫారసులను రాష్ట్రపతి ఆమోదించారు. పది మందిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ ఉత్తర్వులు జారీ చేసిన విష‌యం విదిత‌మే.
హైకోర్టు మొదటి కోర్టు హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయ‌మూర్తి జస్టిస్‌ సతీశ్‌ చంద్రశర్మ నూతన జడ్జిలతో ప్రమాణం చేయించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 19 మంది జడ్జిలు సేవలు అందిస్తున్నారు. గురువారం ప్ర‌మాణ‌స్వీకారం చేసిన 10 మంది జ‌డ్జిల‌తో క‌లుపుకుని 29కి జ‌డ్జిల సంఖ్య చేరింది. అయితే, తెలంగాణ హైకోర్టుకు 42 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉంది. హైకోర్టు చ‌రిత్ర‌లో ఒకేసారి పది మంది న్యాయమూర్తులు నియమితులవడం ఇదే మొదటిసారి కావ‌డం విశేషం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • sworn in
  • Telangana High Court

Related News

    Latest News

    • Budget 2026 -27 : చైనాకు బిగ్ షాక్ ఇచ్చిన బడ్జెట్ !!

    • Budget 2026 – 27 : పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ తెలిపిన బడ్జెట్

    • Budget 2026 – 27 : తెలుగు రాష్ట్రాలకు శుభవార్త తెలిపిన బడ్జెట్

    • Phone Tapping Case : నందినగర్ కు బయల్దేరిన కేసీఆర్‌

    • Budget 2026 : గుడ్ న్యూస్ ! హైదరాబాద్ కు 3 హైస్పీడ్ రైళ్లు – నిర్మలా సీతారామన్ ప్రకటన

    Trending News

      • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

      • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

      • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

      • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

      • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd