HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Special
  • >Why Is Revanth Making Such Mistakes

Big Mistakes : రేవంత్ ఎందుకు ఇలాంటి తప్పులు చేస్తున్నాడు..?

Big Mistakes : హైడ్రా ప్రాజెక్టు కోసం ఇళ్ల కూల్చివేత, కొడంగల్‌లో భూసేకరణ, సినీ పరిశ్రమపై కఠిన వైఖరి, గచ్చిబౌలిలో 400 ఎకరాల భూముల వేలం

  • Author : Sudheer Date : 02-04-2025 - 5:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Revanth Big Mistakes
Revanth Big Mistakes

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, తన సాహసోపేతమైన నిర్ణయాలతో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. టీడీపీలో తన రాజకీయ జీవితం ప్రారంభించి, కాంగ్రెస్‌లో చేరిన తర్వాత కూడా పార్టీ సీనియర్ల విపరీతమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ తన దూకుడైన రాజకీయ శైలితో వారికి సమాధానం ఇచ్చి, చివరకు తెలంగాణ రాజకీయాల్లో గట్టి పట్టు సాధించారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా తన ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కొంటూనే, పాలనలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం కొనసాగిస్తున్నారు. అయితే రేవంత్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారుతూ ప్రజల్లో అసంతృప్తి పెంచుతున్నాయి.

Trivikram : నవీన్ పోలిశెట్టి సినిమాకు త్రివిక్రమ్ సాయం

రేవంత్ రెడ్డి పాలనలో వివాదాస్పదంగా మారిన కొన్ని నిర్ణయాలు ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. హైడ్రా ప్రాజెక్టు కోసం ఇళ్ల కూల్చివేత, కొడంగల్‌లో భూసేకరణ, సినీ పరిశ్రమపై కఠిన వైఖరి, గచ్చిబౌలిలో 400 ఎకరాల భూముల వేలం – ఇవన్నీ ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు పెరుగడానికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా గచ్చిబౌలిలో హరితవనాన్ని నాశనం చేసి, భూములను వేలం వేసే నిర్ణయంపై విద్యార్థులు, పర్యావరణవేత్తలు, సినీ ప్రముఖులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు దీనిని రాజకీయంగా ఆసరాగా తీసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ పార్టీ నిరసనలు చేపడుతోంది. కాంగ్రెస్‌ మంత్రులు ప్రతిపక్షాలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నా, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తిని మాత్రం తగ్గించలేకపోతున్నారు.

Garbage Cess : ప్రజలపై ‘చెత్త’ పన్ను భారం వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా చాకచక్యంగా పాలన సాగించాల్సిన సమయంలో ఒక వివాదం నుంచి మరొకదానికి జారిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాలనలో మైనస్ పాయింట్లు పెరిగితే, ప్రజల్లో నెగెటివ్ ప్రచారం జరగడం సహజం. ఇదే పద్ధతిలో సాగితే ఏపీలో వైసీపీ ఎదుర్కొన్న పరిస్థితులను తెలంగాణ కాంగ్రెస్ కూడా ఎదుర్కొనే ప్రమాదం ఉంది. రేవంత్ తన ఆలోచనలను, పాలనా తీర్నాలను మార్చుకోకపోతే, భవిష్యత్‌లో మరిన్ని రాజకీయ సంక్షోభాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా, వివాదాలకు దూరంగా, అభివృద్ధి లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోవడం మాత్రమే రేవంత్ రెడ్డికి రాజకీయంగా ఊరట తీసుకువస్తుంది. మరి రేవంత్ ఏంచేస్థాడో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Allu Arjun Arrest
  • Big Mistakes
  • CM revanth Reddu
  • HCU
  • HYDRAA

Related News

Even though KTR got entangled in his own challenge, Revanth Reddy gained the upper hand over BRS!

Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

ధైర్యవంతమైన మరియు నిర్ణయాత్మక నాయకత్వంతో, కాళేశ్వరం ప్రాజెక్ట్ వైఫల్యంపై చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ప్రకటించడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, KTRను మరియు మొత్తం BRSను ఇబ్బందుల్లో పడేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉంటుందని భావించి సవాలు విసిరిన అహంకారి KTR, ఇప్పుడు తప్పించుకునే మార్గాల కోసం నానా తంటాలు పడుతున్నారు. అసెంబ్లీలో గంభీరమైన చర్చకు బదులు

  • High Court takes a serious view of the Owaisi educational institution!

    Owaisi college: ఒవైసీ విద్యాసంస్థపై హైకోర్టు సీరియస్!

Latest News

  • Medicines Prices: సామాన్యుడికి భారీ ఉపశమనం.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం

  • Kadapa: బ్రహ్మణి స్టీల్స్ భూములు పై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

  • H-1B: హెచ్-1 బీ, గ్రీన్ కార్డ్ అభ్యర్థులకు అలర్ట్.. ఇకపై కొత్త రూల్స్..!

  • CM Chandrababu: బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

  • Ram Temple: రామమందిర ట్రస్ట్.. కార్పొరేట్ తరహా ప్రక్షాళనపై దృష్టి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd