HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Special
  • >The Plight Of World Famous Koyya Bommalu Designers

Koyya Bomma : కొయ్య బొమ్మ ఆత్మకథ

మా పూర్వీకులు ప్రస్తుతం నాకు ఆశ్రయమిస్తోన్న రజాలి బేగ్ తాతలు, ముత్తాతల చేతుల్లో ప్రాణం పోసుకున్నారు. వాళ్ళంతా సంతోషంగా బ్రతికి, ఇతరులకు ఆనందాన్ని పంచారు.

  • By Siddartha Kallepelly Published Date - 04:58 PM, Wed - 2 March 22
  • daily-hunt
Koyya Bomma1
Koyya Bomma1

మా పూర్వీకులు ప్రస్తుతం నాకు ఆశ్రయమిస్తోన్న రజాలి బేగ్ తాతలు, ముత్తాతల చేతుల్లో ప్రాణం పోసుకున్నారు. వాళ్ళంతా సంతోషంగా బ్రతికి, ఇతరులకు ఆనందాన్ని పంచారు. కాలం కదులుతున్న కొద్దీ నేను నా భవిష్యత్తుపై నమ్మకాన్ని మెల్లిమెల్లిగా కోల్పోతున్నాను. ఇప్పుడు వెంటిలేటర్ పై అతి కష్టంగా ఊపిరి తీసుకుంటున్న నేను, రజాలి బేగ్ లాంటివాళ్ళ తర్వాత నా శ్వాస పూర్తిగా ఆగిపోతుందేమో అనిపిస్తోంది. ప్రాణందేముంది లే… పుట్టినవాడికి గిట్టడం తప్పదుగా అని ఎన్నిసార్లు సర్దిచెప్పుకుంటున్నా మనసంతా దిగులుగా ఉంది. ఎందుకంటే నా బాధ పోయే ప్రాణం గురించి కాదు. చరిత్రలో ప్రశ్నార్థకమయ్యే నా ఉనికి గురించి.

మారుతున్న మార్కెట్ కల్చర్, పెరుగుతున్న ప్లాస్టిక్ భూతంతో మొదలైన నా కష్టాలు లాక్డౌన్ నుండి మరింత ఎక్కువయ్యాయి. రంగురంగుల్లో జనాలని రంజింపచేసే నన్ను కరోనా కసకస తొక్కి పడేసింది. కటినమైన కరోనా అంక్షల్లో మీకందరికీ రోజులో కొంత సమయమైనా బయటకెళ్ళే అవకాశం దొరికింది. కానీ నా అవసరం ఒక్కరికి కూడా రాలేదు. నా దగ్గరికి ఎవరైనా వస్తారని, నన్ను తమ చేతులతో తడుముతారని అద్దాల వెనకాల ఉండి నిరీక్షించిన క్షణాలన్నీ నిరుపయోగమయ్యాయి.

ఒకప్పుడు మేం బాగా బ్రతికినవాళ్ళమే. ఇప్పుడు బతికి చెడినవాళ్ళం. దేశంలో ఉన్న అన్ని పుణ్య క్షేత్రాల్లో అడుగుపెట్టిన వాళ్ళమే. కొన్ని రాష్ట్రాల్లో మాకు ప్రత్యెక గుర్తింపు ఉంది. అసలు మేం లేకపోతే పెళ్ళిళ్ళు కూడా జరగవు. పెళ్లిల్లో వధువు వరుడికి, వరుడు వధువుకి ఇచ్చే తోలి కానుకలం మేమే. కానీ మొదట్లో చెప్పుకున్నట్టు కాలం కదులుతున్న కొద్దీ మా గుర్తింపు తగ్గుతూ వస్తోంది. గుర్తింపు తగ్గినా పర్లేదు అనుకునేవాళ్ళం కానీ పుట్టిన నేలలోనే ఆదరణ కోల్పోయి అనాధలుగా మిగిలాం. మమ్మల్ని ఎవరూ కానరాక ఇన్ని రోజులు మమ్మల్ని పెంచి, మా మంచిచెడ్డలు చూసుకున్నవాళ్ళకు కూడా మేం భారంగా మారి దిక్కుతోచని స్థితిలోకి నెట్టివేయబడ్డారు. పాపం మమ్మల్ని వాళ్ళ ఆలోచనల్లో కనడమే వారికి శాపమయ్యింది.

అందానికి పెద్దపీట వేసే ఈ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొనే మమ్మల్ని అపురూపంగా తీర్చిదిద్దారు. శంఖం లాంటి ముక్కు, దొండపండు లాంటి పెదాలు, సోట్టపడే బుగ్గలు, రింగురింగుల కురులు బహుశా కవులు ఇలాంటి ఉపమానాలన్ని మమ్మల్ని చూసే రాసుకున్నట్టున్నారు. మేం బయటకొచ్చే పదిరోజుల ముందునుండే మా అలంకరణ మొదలవుతుంది. మావాళ్ళు అడవికి వెళ్లి, అరుదైన చెట్ల దగ్గరి నుండి కొన్ని వస్తువులు తీసుకొచ్చి, పదిరోజుల పాటు పలురకాలుగా మాకు అభిషేకాలు చేస్తారు. ఆ తర్వాత కొందరు మహిళలు మమ్మల్ని అలంకరించి తుదిరూపం ఇస్తారు. ఇంత అందంగా ఉన్నా మా అవసరం లేక మమ్మల్ని ఎవరు దగ్గరికి తీసుకోకపోవడంతో మాకు రూపం ఇచ్చినవారు నశించిపోయి, మాపై అలకతో కూళీపనులకు వెళ్తున్నారు.

ఇంతకీ నేనవరో చెప్పలేదు కదా…
ఒకనాడు దేశమంతా వెలుగొందినదాన్ని,
నేడు దేశమంతా నిరాదరణకి గురవుతున్నదాన్ని,
నేను కొయ్య బొమ్మని.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • koyya bomma
  • wooden toys

Related News

    Latest News

    • Congress : ప్రభుత్వం మారితేనే న్యాయం జరుగుతుందేమో..? – రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు

    • Kutami Super 6 : అనంతపురంలో ఈ నెల 10న సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభ

    • Nara Lokesh : శ్రీ ఆదిచుంచనగిరి మఠాన్ని సందర్శించిన మంత్రి నారా లోకేశ్

    • TTD: రేపు ఎన్నిగంట్లకు టీటీడీలో దర్శనమంటే.?

    • Venezuela : కరేబియన్‌లో ఉద్రిక్త వాతావరణం: వెనుజువెలా ఆక్రమణకు అమెరికా సిద్ధం..!

    Trending News

      • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

      • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd