Ceiling Fans – Govt Norms : ఆ సీలింగ్ ఫ్యాన్లపై బ్యాన్.. వాటిని అమ్మితే రెండేళ్ల జైలుశిక్ష !
Ceiling Fans - Govt Norms : ఇంట్లో, షాపుల్లో వాడుకోవడానికి సీలింగ్ ఫ్యాన్ కొంటున్నారా..ఒక్క నిమిషం ఆగండి. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది.
- Author : Pasha
Date : 20-08-2023 - 1:13 IST
Published By : Hashtagu Telugu Desk
Ceiling Fans – Govt Norms : ఇంట్లో, షాపుల్లో వాడుకోవడానికి సీలింగ్ ఫ్యాన్ కొంటున్నారా..
ఒక్క నిమిషం ఆగండి. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది.
అమ్మే సీలింగ్ ఫ్యాన్‌లు అన్నీ నాణ్యమైనవి కాదని కేంద్రప్రభుత్వం చెబుతోంది.
అందుకే ఇకపై సీలింగ్ ఫ్యాన్‌లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
Also read : Atal Pension Yojana: అటల్ పెన్షన్ యోజన.. నెలకు రూ. 210 కాంట్రిబ్యూషన్‌తో రూ. 5 వేల పెన్షన్..!
సీలింగ్ ఫ్యాన్ ల తయారీలో క్వాలిటీ, సేఫ్టీ పై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. నాణ్యతలేని ఫ్యాన్లను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి అడ్డుకట్ట వేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) కలిగిన సీలింగ్ ఫ్యాన్లనే విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇకపై బీఐఎస్ మార్క్ లేని ఎలక్ట్రిక్ సీలింగ్ ఫ్యాన్ల ఉత్పత్తి, విక్రయం, దిగుమతిపై బ్యాన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ వెలువడిన తేదీ (ఆగస్టు 9)కి ఆరు నెలల తర్వాతి నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది.
Also read : 58000 Crorepatis : 58వేల మంది కోటీశ్వరులయ్యారు.. ఎలా అంటే ?
ఒకవేళ తమ నిబంధనలను ఉల్లంఘిస్తే బీఐఎస్ చట్టం ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష లేదా రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తామని DPIIT (Ceiling Fans – Govt Norms) స్పష్టం చేసింది. ఒకవేళ రెండోసారి, అంతకంటే ఎక్కువసార్లు ఉల్లంఘనలకు పాల్పడితే రూ.5 లక్షలు జరిమానా లేదా వస్తువుల విలువకు 10 రెట్లు జరిమానాగా విధిస్తామని తెలిపింది. ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్‌ను అమలుచేసేందుకు ఎంఎస్‌ఎస్‌ఈ సెక్టార్‌కు మాత్రం 12 నెలల పాటు గడువు ఇస్తున్నట్లు డీపీఐఐటీ పేర్కొంది. వినియోగదారుల భద్రత, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ఈ నోటిఫికేషన్ జారీ చేసినట్లు డీపీఐఐటీ వివరించింది. నాణ్యతలేని ఫ్యాన్‌ల దిగుమతికి అడ్డుకట్ట వేయడంతో పాటు దేశీయ తయారీ సంస్థలను ప్రోత్సహించాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని తేల్చి చెప్పింది.