Milk Business: కాసులు కురిపిస్తున్న పాల వ్యాపారం, నెలకు లక్ష సంపాదిస్తున్న బోర్గాడి గ్రామస్తులు
చేయాలనే పట్టుదల ఉండాలే కానీ సొంత గ్రామంలోనూ ఉపాధి పొందవచ్చు. అందుకే ఉదాహరణే మహారాష్ట్రలోని బోర్గాడి గ్రామం.
- By Balu J Published Date - 01:51 PM, Tue - 22 August 23
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బోర్గాడి గ్రామం ముఖ్యాంశాలలో నిలిచింది. నిజానికి ఈ గ్రామం మొత్తం పాల వ్యాపారం చేస్తూ మంచి లాభాలు పొందుతోంది. 20 ఏళ్ల క్రితం రైతు హన్మంతు గోపువాడ్ 1 గేదె కొనుగోలు చేసి పాల వ్యాపారం ప్రారంభించాడు. క్రమంగా ఇప్పుడు ఊరంతా పాల వ్యాపారం వైపు మళ్లింది.
హన్మంతు గోపువాడ్కు ఈరోజు 10 గేదెలు ఉన్నాయి. వీటిలో 6 గేదెలు పాలు ఇస్తున్నాయి. ఈ గేదెల నుంచి ఉదయం, సాయంత్రం రెండుసార్లు 50 లీటర్ల పాలు లభిస్తాయి. ఈ పాల ధర లీటరు రూ.60. గ్రామ సమీపంలోని హిమాయత్‌నగర్ పట్టణానికి తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. దీంతో రోజుకు రూ.2500 నుంచి 3000 వరకు ఆదాయం పొందుతున్నాడు. ఖర్చులు తీసివేస్తే నెలకు దాదాపు రూ.లక్ష లాభం వస్తుంది. ఈ పాల వ్యాపారం ద్వారా 5 ఎకరాల భూమిని కూడా కొనుగోలు చేశాడు. ప్రతి రైతు ఆవుల, గేదేల పెంపకాన్ని తప్పనిసరిగా వ్యాపారంగా చేసుకోవాలని హనుమంతు గోపువాడ్ సూచించారు.
హనుమంతు గోపువాడ్ మరొకరి పొలంలో కాపలాగా పనిచేస్తూ గేదెను తీసుకొని గ్రామంలో పాల వ్యాపారం ప్రారంభించాడు. ఆ తర్వాత ఆయనను స్ఫూర్తిగా తీసుకుని గ్రామంలోని చాలా మంది పాల వ్యాపారం ప్రారంభించారు. లాభాన్ని చూసి ఇక్కడి యువ రైతులు కూడా పాల వ్యాపారం వైపు మొగ్గు చూపారు. దీంతో ఉద్యోగాల కోసం బయట తిరగాల్సిన పనిచేలేకుండా పోయింది ఇక్కడ యూత్ కు.
Also Read: Medak: షాకింగ్.. అతిగా నిద్రిస్తున్నారనే కారణంతో పిల్లలపై వేడినీళ్లు పోసిన తల్లి
Related News
Shah Deepfake Video: అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఇంతకీ ఏం జరిగింది?
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షాకు సంబంధించిన ఓ ఫేక్ వీడియో వైరల్‌గా మారింది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడితే రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ ఆయన చెబుతున్నట్లు ఆ వీడియోలో వినిపిస్తోంది