Kamal Haasan Birthday : కమలహాసన్ జీవితంలోని ఆసక్తికర విశేషాలు
Kamal Haasan Birthday : ‘కమలహాసన్’.. ఈ పేరు చెప్పగానే మనకు ఆయన నేచురల్ యాక్టింగ్ గుర్తుకు వస్తుంది.
- By Pasha Published Date - 10:16 AM, Tue - 7 November 23
Kamal Haasan Birthday : ‘కమలహాసన్’.. ఈ పేరు చెప్పగానే మనకు ఆయన నేచురల్ యాక్టింగ్ గుర్తుకు వస్తుంది. సహజమైన డైలాగ్ డెలివరీ కళ్లెదుట కనిపిస్తుంది. నటనలో తనదైన ముద్రవేసిన కమలహాసన్ 69వ బర్త్ డే ఈరోజే (నవంబర్ 7) . ఆయన రాత్రికి రాత్రి గొప్ప స్టార్ కాలేదు. దాని వెనుక చాలా శ్రమ ఉంది. సహనం ఉంది. పట్టుదల ఉంది. ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళితే.. నాలుగేళ్ల వయసులోనే బాల నటుడిగా కమలహాసన్ సినిమా కెరీర్ మొదలైంది. 1960లో జెమినీ గణేష్ మహానటి సావిత్రి నటించిన ‘కళాతూర్ కన్నమ్మ’ చిత్రంలో చైల్డ్ యాక్టర్ గా కమలహాసన్ నటించారు. అప్పుడు కమలహాసన్ వయసు 6 సంవత్సరాలు. ఈ సినిమాలో నటించినందుకు చైల్డ్ యాక్టర్ గా రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రెసిడెంట్ అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత చదువు కోసం ఆయన సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. 1970లో మళ్ళీ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈసారి నటుడు గానే కాకుండా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ డాన్సర్ గా పని చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
- సినిమాలలో హీరోగా ఛాన్స్‌లు లభించే వరకు.. విలన్ పాత్ర, సపోర్టింగ్ పాత్రలను కమలహాసన్ పోషించారు. వీటితో పాటు నృత్య కళాకారుడిగా, కథకుడిగా, మాటల రచయితగా, స్క్రీన్ ప్లే రైటర్‌గా, గాయకుడిగానూ ఆయన సినిమాలలో వర్క్ చేశారు.
- 1974లో మలయాళం మూవీ కన్యాకుమారితో హీరోగా తన కెరీర్‌ను మొదలుపెట్టారు. అలా మొదటి సినిమాతోనే మలయాళంలో బెస్ట్ యాక్టర్ గా అవార్డును అందుకున్నారు.
- కమల్ కెరీర్ మలయాళం, తమిళ సినిమాల్లో మొదలైనా.. తెలుగు, హిందీ, ఇతర భాషల్లోనూ నటించి బహుభాషా నటుడిగా పేరు తెచ్చుకున్నారు.
- కమల్ హసన్ వందో చిత్రం రాజ పేరవై 1981లో రిలీజ్ అయింది. ఈ మూవీతోనే ఆయన తొలిసారి నిర్మాతగా మారారు. ఇందులో అంధుడైన వయోలినిస్ట్‌గా కమల్ నటనకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు వచ్చింది.
- కమల్ హసన్ నాస్తికుడు.
- 2018 ఫిబ్రవరిలో ఆయన తమిళనాడులో ‘మక్కల్ నీది మయ్యం’ పేరిట పార్టీని(Kamal Haasan Birthday) ప్రారంభించారు.
Also Read: Whats Today : హైదరాబాద్‌కు ప్రధాని మోడీ.. పెద్దపల్లికి సీఎం కేసీఆర్.. పుట్టపర్తికి జగన్
Related News
Ram Charan : కమల్, రజినితో పాటు ఒకే స్టేజిపై కనిపించబోతున్న రామ్ చరణ్..
కమల్, రజినితో పాటు ఒకే స్టేజిపై కనిపించబోతున్న రామ్ చరణ్. దర్శకుడు శంకర్ తన భారీ ప్లాన్‌తో..