Longest Bridge : ఓడలు వస్తే తెరుచుకునే.. రైళ్లు వస్తే మూసుకునే వంతెన
Longest Bridge : దేశంలోనే పొడవైన రైలు వంతెన పేరు ‘‘పంబన్’’. ఇది 2024 ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది.
- Author : Pasha
Date : 21-11-2023 - 3:45 IST
Published By : Hashtagu Telugu Desk
Longest Bridge : దేశంలోనే పొడవైన రైలు వంతెన పేరు ‘‘పంబన్’’. ఇది 2024 ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. తమిళనాడులోని రామేశ్వరంలో ఉన్న పంబన్ ద్వీపం.. అదే రాష్ట్రంలోని మండపం పట్టణాలను అనుసంధానిస్తూ సముద్రం మీదుగా ‘‘పంబన్’’ రైల్వే వంతెనను నిర్మిస్తున్నారు. ఇది మన దేశంలోని మొట్టమొదటి హైడ్రాలిక్ రైలు వంతెన. క్రూయిజర్ షిప్ వచ్చినప్పుడు, ఈ వంతెనను పైకి లేపుతారు. రైలు వచ్చినప్పుడు ఈ వంతెన రైల్వే ట్రాక్‌కి లింక్ అవుతుంది. ఈ వంతెన నిర్మాణ పనులు 2019 సంవత్సరంలో ప్రారంభమయ్యాయి. ఇటీవల ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగిన 42వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో పంబన్ వంతెన నమూనాను ప్రదర్శించారు. పంబన్ వంతెన ఎలా పని చేస్తుందనేది మోడల్ ద్వారా వివరించారు.
We’re now on WhatsApp. Click to Join.
- తమిళనాడులోని రామేశ్వరం ద్వీపాన్ని కనెక్ట్ చేసేందుకు తొలిసారిగా 1914లో రైల్వే వంతెనను నిర్మించారు. అంటే ప్రస్తుతమున్న వంతెన శతాబ్దానికిపైగా పాతది.
- కొత్తగా నిర్మిస్తున్న పంబన్ రైల్వే వంతెన పొడవు 2.08 కిలోమీటర్లు. దీనిపై రెండు రైల్వే లైన్లు ఉన్నాయి. రూ. 545 కోట్లతో ఈ వంతెనను నిర్మిస్తున్నారు.
- సునామీ, తుఫాను వచ్చినా తట్టుకునేలా పంబన్ వంతెనను అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్నారు.
- తమిళనాడు రాష్ట్రంలో నిర్మిస్తున్న పంబన్ వంతెన దక్షిణ రైల్వేలోని మధురై డివిజన్ పరిధిలోకి వస్తుంది.
- పంబన్ వంతెన ద్వారా రామేశ్వరానికి భక్తులు ఈజీగా వెళ్లొచ్చు.