Re 1 Coin: ఒక్క రూపాయి కాయిన్ తయారీ కోసం భారత్ ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా?
ఇటీవల జరిగిన రష్యా, ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
- By Nakshatra Published Date - 11:04 AM, Sat - 27 August 22
ఇటీవల జరిగిన రష్యా, ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సంక్షోభం కారణంగా వస్తువుల ధరలు గణనీయంగా పెరిగిపోయాయి. దీంతో నాణెం విలువ తగ్గిపోయింది. కానీ నాణెం తయారు చేయడానికి అయ్యే ఖర్చు దాని వాస్తవ విలువను మించిపోయింది అని తాజాగా ఆర్బిఐ తెలిపింది. కాగా ఈ నాణెం నికెల్, రాగి మరియు జింక్ వంటి లోహాల నుండి తయారు చేయబడుతుంది. నాణెం తయారు చేయడానికి పట్టే లోహం మొత్తం దాని యొక్క ద్రవ్య విలువ కంటే ఎక్కువ విలువైనది.
ఇక పోతే 1992 నుండి స్టెయిన్ లెస్ స్టీల్ సహాయంతో 1 రూపాయి నాణెం తయారు చేయబడింది. ఇది 3.76 గ్రాముల బరువు మరియు 21.93 మిల్లీమీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కాగా ఈ నాణెం మందం 1.45 మిల్లీమీటర్లు. గత రెండు దశాబ్దాల్లో ఒక రూపాయి నాణెం ద్రవ్య విలువ తగ్గినప్పటికీ,ఆ నాణెం తయారీ ఖర్చు మాత్రం పెరిగింది. అయితే సాధారణంగా ఒక రూపాయి నాణెం తయారు చేయడానికి సగటు ఖర్చు 1 రూపాయి 11 పైసలు(1.11).
అంటే, ఒక రూపాయి నాణెం తయారు చేయడానికి అయ్యే మొత్తం ఖర్చు దాని మొత్తం విలువ కంటే 11 పైసలు ఎక్కువ. మరో మాటలో చెప్పాలంటే, ఈ నాణెం యొక్క తయారీ ఖర్చు ముఖ విలువను అధిగమించింది.
Tags
Related News
RBI New Rule: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మీ బ్యాంక్ అకౌంట్లో మైనస్ బ్యాలెన్స్ ఉన్నాయా..?
బ్యాంకులకు సంబంధించిన పనులు పూర్తి చేసేందుకు గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఒకప్పుడు ఉండేది.