Loan Surety : ఇతరుల లోన్‌కు ష్యూరిటీ ఇస్తున్నారా ? ఇవి గుర్తుంచుకోండి
అంటే ష్యూరిటీ సంతకం అనేది లోన్ మంజూరులో కీలకమైంది. అయితే ఇలా ఇతరుల లోన్లకు ష్యూరిటీ(Loan Surety) ఇచ్చే క్రమంలో కొన్ని కనీస జాగ్రత్తలు పాటించాలి.
- By Pasha Published Date - 05:12 PM, Thu - 29 August 24
Loan Surety : చాలామంది లోన్ కోసం అప్లై చేసినప్పుడు బ్యాంకులు/ఆర్థిక సంస్థలు తప్పకుండా ష్యూరిటీ గురించి అడుగుతాయి. ఎవరితోనైనా ష్యూరిటీ సంతకం పెట్టించమని కోరుతాయి. ఈక్రమంలో ఎంతోమంది తమ స్నేహితులు, బంధువులతో ష్యూరిటీ సంతకాలు పెట్టిస్తాయి. వారి ఆదాయ వివరాలు, అడ్రసు వివరాలను బ్యాంకుకు సమర్పిస్తాయి. అనంతరం బ్యాంకు వాటిని తమ వద్ద ఉంచుకొని లోన్‌ను మంజూరు చేస్తుంది. అంటే ష్యూరిటీ సంతకం అనేది లోన్ మంజూరులో కీలకమైంది. అయితే ఇలా ఇతరుల లోన్లకు ష్యూరిటీ(Loan Surety) ఇచ్చే క్రమంలో కొన్ని కనీస జాగ్రత్తలు పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
- మనం ఎవరి లోన్ కోసమైతే ష్యూరిటీ ఇస్తున్నామో వారి ఆదాయ వివరాలపై తప్పకుండా ఒక అవగాహనకు రావాలి. వాటి గురించి అడిగి తెలుసుకోవాలి.
- లోన్ ఎంత తీసుకుంటున్నారు ? ఎన్ని నెలల్లో దాన్ని తిరిగి కట్టాలి ? అనే సమాచారంపైనా ష్యూరిటీ ఇచ్చే వ్యక్తి ఆరా తీయాలి. దీనివల్ల ఆ లోన్ ఎప్పటిలోగా ముగుస్తుందనే దానిపై ఒక క్లారిటీ వస్తుంది.
- అకస్మాత్తుగా ఉద్యోగం కోల్పోవడం, వ్యాపారంలో నష్టపోవడం వంటివి జరిగితే లోన్ తీసుకున్న వ్యక్తి అప్పును సకాలంలో తిరిగి కట్టే పరిస్థితి ఉండదు. ఈ టైంలో ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తినే బ్యాంకులు ప్రశ్నిస్తాయి. అప్పును కట్టాలని అతడిని కూడా అడుగుతాయి. ఈ టైంలో ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తిపై ఒత్తిడి పెరుగుతుంది.
- మనం ఎవరికైతే ష్యూరిటీ ఇచ్చామో.. అతడు లోన్ తిరిగి కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకలా జరిగిందో ఆరా తీయాలి. సకాలంలో పేమెంట్స్ చేయాలని సూచించాలి.
- ఒకవేళ లోన్ తీసుకున్న వ్యక్తి అస్సలు పేమెంట్స్ చేయకుంటే.. బ్యాంకు నుంచి నేరుగా ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తికి నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది. వాటికి ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తి సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. లోన్ తిరిగి కట్టేలా.. లోన్ పొందిన వ్యక్తిని ఒప్పించే బాధ్యత కూడా ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తిపైకి వెళ్తుంది. ఇన్ని బాధలు ఉంటాయి కాబట్టే.. చాలామంది లోన్లకు ష్యూరిటీలు ఇచ్చేందుకు భయపడుతుంటారు.
- లోన్ తీసుకున్న వ్యక్తి లోన్‌ను కట్టకుంటే బ్యాంకు వాళ్లు నేరుగా ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తి వద్దకు వెళ్తారు. అవసరమైతే ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తికి చెందిన ఆస్తులను జప్తు చేసే హక్కు కూడా బ్యాంకుకు ఉంటుంది.
- లోన్‌ను ఎవరైనా ఎగవేస్తే.. దానికి ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తికి సంబంధించిన క్రెడిట్ స్కోరు కూడా దెబ్బతింటుంది. దీనివల్ల భవిష్యత్తులో లోన్లు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి.
Also Read :Mamata Banerjee : ప్రధాని మోడీకి వార్నింగ్ వ్యాఖ్యలు.. సీఎం దీదీపై పోలీసులకు ఫిర్యాదు
Related News
Telangana: రూ.1790 కోసం ఆత్మహత్య, ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం
తెలంగాణలో ఔట్సోర్సింగ్ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేవలం రూ.1790 కోసం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. ఈ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.