APAAR Card : ‘అపార్’ కార్డు గురించి తెలుసా ? ఇవీ ప్రయోజనాలు
APAAR Card : ఆధార్ కార్డు గురించి మనకు తెలుసు. ‘అపార్’ కార్డు గురించి తెలుసా ?
- By Pasha Published Date - 12:20 PM, Wed - 13 December 23
అపార్ కార్డులను(APAAR Card) జారీ చేసేందుకు కేంద్ర విద్యాశాఖ అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ఏబీసీ)ని ప్రారంభించింది. ఇది ఎకో సిస్టమ్ రిజిస్ట్రీగా పనిచేస్తుంది. ఇందులో రిజిస్టర్ చేసుకునేందుకు తొలుత ఏబీసీ బ్యాంక్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఆ తర్వాత ‘మై అకౌంట్’పై.. అందులోని ‘స్టూడెంట్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత డిజిలాకర్ అకౌంట్‌ను తెరవడానికి ‘సైన్ అప్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ విద్యార్థి మొబైల్ నంబర్, చిరునామా, ఆధార్ కార్డు వంటి వివరాలను నమోదు చేయాలి. ఆ తర్వాత మీ వ్యక్తిగత ఆధారాలను ఉపయోగించి డిజి లాకర్ అకౌంట్‌కి లాగిన్ అవ్వాలి. ఇప్పుడు కేవైసీ ధ్రువీకరణ కోసం ఏబీసీతో ఆధార్ కార్డు వివరాలను పంచుకోవడానికి.. డిజిలాకర్ మీ పర్మిషన్ అడుగుతుంది. ‘ఐ యాక్సెప్ట్’పై నొక్కాలి. అనంతరం విద్యార్థి చదువుతున్న పాఠశాల/యూనివర్సిటీ పేరు, తరగతి, కోర్సు మొదలైన విద్యావివరాలను ఎంటర్ చేయాలి. చివరగా ఫారమ్‌ను సబ్మిట్ చేస్తే.. అపార్ ఐడీ కార్డు క్రియేట్ అవుతుంది. అయితే విద్యాసంస్థలు ‘అపార్’ కార్డును జారీ చేసే ముందు విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలి.
Related News
Google Pay: గూగుల్ పేలో సరికొత్త ఫీచర్.. ఇకపై ఆధార్ తో యూపీఐ పేమెంట్?
టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యి ఆన్లైన్ పేమెంట్ యాప్స్ ఉపయోగం పెరిగిపోవడంతో ప్రతి ఒక్కరూ గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యాప్స్ ని వినియోగిస్తున