Countries Vs Condoms : ఆరు దేశాల్లో కండోమ్స్‌పై బ్యాన్.. ఎందుకు ?
Countries Vs Condoms : సురక్షితమైన లైంగిక జీవితం కోసం.. ఎయిడ్స్ నుంచి రక్షణ కోసం.. కండోమ్స్ అత్యవసరం. కండోమ్స్ వినియోగంలోకి వచ్చాక.. ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ కేసులు కూడా బాగా తగ్గిపోయాయి.
- By Pasha Published Date - 03:35 PM, Fri - 24 November 23
Countries Vs Condoms : సురక్షితమైన లైంగిక జీవితం కోసం.. ఎయిడ్స్ నుంచి రక్షణ కోసం.. కండోమ్స్ అత్యవసరం. కండోమ్స్ వినియోగంలోకి వచ్చాక.. ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ కేసులు కూడా బాగా తగ్గిపోయాయి. ఈ కారణాల రీత్యా కండోమ్స్ వినియోగాన్ని ప్రోత్సహించాలి. కానీ కొన్ని దేశాలు కండోమ్స్ వినియోగంపై బ్యాన్ విధించాయి. ఇంతకీ ఏయే దేశాలు కండోమ్స్‌పై బ్యాన్ విధించాయి ? ఎందుకు విధించాయి ? ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join.
- కిమ్ జోంగ్ ఉన్ పాలనలో ఉన్న ఉత్తర కొరియాలో అన్నీ వెరైటీ చట్టాలే అమల్లో ఉంటాయి. అక్కడ కండోమ్‌లను ఉపయోగించడం చట్టవిరుద్ధమేం కాదు. కానీ వాటిని అమ్మడం చట్ట విరుద్ధం. దేశ జనన రేటును పెంచేందుకు కిమ్ ఈ ఆంక్ష విధించారు.
- ఇండోనేషియాలో కండోమ్‌ల వాడకంపై సాంస్కృతిక నిషేధం అమల్లో ఉంది. అయితే దీనిపై చట్టపరమైన నిషేధం విధించాలని ఇండోనేషియా ఇస్లామిక్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
- ఆఫ్రికాలోని నైజీరియా దేశంలో కండోమ్‌లను వాడటాన్ని అనైతిక చర్యగా పరిగణిస్తారు. కండోమ్‌లపై ఎక్కువగా ప్రచారం చేస్తే వ్యభిచారం పెరుగుతుందని నైజీరియా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే అక్కడ కండోమ్‌లపై ప్రచారం చేయడం చట్టవిరుద్ధం.
- ఆఫ్రికాలోని జాంబియా దేశంలో కండోమ్‌ల వినియోగంపై సాంస్కృతిక నిషేధం అమల్లో ఉంది. ఇక్కడి జనాభాలో ఎక్కువ మంది క్రైస్తవులు. వారు మత విశ్వాసాల ప్రకారం కండోమ్‌లను ఉపయోగించడానికి ఇష్టపడరు. కండోమ్‌లను ఉపయోగించడాన్ని బలహీన చిహ్నంగా పరిగణిస్తారు.
- ఆఫ్ఘనిస్తాన్‌లో కండోమ్‌లను విక్రయించడం, ఉపయోగించడం నిషేధం. తాలిబాన్లు ఈ చట్టాన్ని 2020 సంవత్సరం నుంచి కఠినంగా అమలుచేస్తున్నారు. ఈ నిషేధం వెనుక బలమైన మత విశ్వాసం ఉంది.
- ఫిలిప్పీన్స్ దేశంలో కండోమ్స్ వాడకం చాలా తక్కువ. ఇక్కడ కండోమ్స్ వాడకంపై సాంస్కృతిక నిషేధం ఉంది. ఫండమెంటలిస్ట్ క్రిస్టియన్ విశ్వాసాల వల్ల కూడా ఇక్కడ కండోమ్‌ల వినియోగం చాలా తక్కువగా(Countries Vs Condoms) ఉంది.
Related News
Condoms In Samosas: సమోసాలలో కండోమ్‌లు.. ఎక్కడంటే..?
మహారాష్ట్రలోని పూణెలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక ఆటోమొబైల్ క్యాంటీన్లో ఉద్యోగులకు కండోమ్‌లు, గుట్కా, రాళ్లను కలిపి సమోసాలు (Condoms In Samosas) అందించారు.